Azadi Ka Amrit Mahotsav: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసేదే ఇంటింటా ఇన్నోవేటర్-2022. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటా ఇన్నోవేషన్ (ప్రతి ఇంటి నుండి ఇన్నోవేషన్) కార్యక్రమం ఔత్సాహిక ఆవిష్కర్తలకు తమ సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు, సమాజం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలు, సవాళ్లను పరిష్కరించడానికి ఆలోచనలను ప్రదర్శించడానికి అనువైన వేదికను అందించింది. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు తమలోని ప్రతిభకు మరింత పదునుపెట్టి అద్భుతాలను సృష్టిస్తున్నారు. జడ్పీహెచ్‌ఎస్ మునిమోక్షం విద్యార్థిని కె. శిరీష తమ ప్రాణాలను పణంగా పెట్టి పొడవాటి చెట్లను ఎక్కి కల్లు కొట్టే వారికి ఉపయోగపడేలా ఓ సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఇది చెట్ల పై నుండి పడిపోయే ప్రమాదాల్ని నివారిస్తుంది.
మహబూబ్‌నగర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ యాదిరకు చెందిన విద్యార్థి టి అనిల్ కుమార్ నిర్మాణ రంగంలో ఉపయోగించగల ‘ఫైర్ రెసిస్టెంట్’ రబ్బరు ఇటుకలను కనుగొన్నారు. తద్వారా ఖర్చులు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రయత్నం చేశారు. ఇందులో వ్యర్థమైన రబ్బరు,ప్లాస్టిక్‌లను రబ్బరు ఇటుకలుగా మారుస్తుంది.
మొత్తంమీద, ‘ఇంటింటా ఇన్నోవేటర్ 2022’ కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అన్ని వర్గాల ప్రజల నుండి 28 కొత్త ఆవిష్కరణలను రూపొందించింది. జిల్లాకు చెందిన వివిధ వ్యక్తులు రూపొందించిన 28 కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మకత ప్రాజెక్టుల్లో 9 ఆవిష్కరణలు రాష్ట్ర స్థాయి తుది జాబితాకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వాస్తవానికి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ 3లో నిలిచింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అత్యంత ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌లను తీసుకురావడంలో మొదటి స్థానంలో ఉంది” అని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు తెలిపారు.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో షార్ట్‌లిస్ట్ చేసిన సాంకేతికతలను తప్పకుండా ప్రదర్శిస్తామని, విజేతలకు ధృవీకరణ పత్రాలతో సత్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సృష్టికర్తలు,మార్గదర్శకులు అందరూ తమ ఆవిష్కరణలను స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి తీసుకురావాలని కోరారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి