Telangana: ఓర్నీ.. ఈ సొరకాయ ఏంది.. సొర చేప అంత ఉంది..

|

Feb 12, 2023 | 3:23 PM

మాములుగా సొరకాయ రెండు అడుగులు ఉంటేనే ఎంత పొడవుందో అనుకుంటారు. కానీ ఆ చెట్టుకు ఉన్న కాయలన్నీ ఆల్మోస్ట్ నాలుగడుగులు పెరుగుతున్నాయి.

Telangana: ఓర్నీ.. ఈ సొరకాయ ఏంది.. సొర చేప అంత ఉంది..
Bottle Gourd
Follow us on

సరిగ్గా వండాలి కానీ.. సొరకాయ కూర అదిరిపోద్ది. వేడి వేడి అన్నంలో అప్పుడే వండిన సొరకాయ కూర వేసుకుని తింటే.. ఆహా ఆ రుచి చెప్పతగునా..? సాంబార్‌లో కూడా సొరకాయ వేస్తేనే మాంచి టేస్ట్ వస్తుంది. అది కాదులే గానీ.. సొరకాయ మామలుగా 2 అడుగుల వరకు పెరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం శ్యాంపూర్‌లోని మురళీధర్‌ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పాదుకు.. పెద్ద సొరకాయలు కాస్తున్నాయి. అవి ఏకంగా నాలుగైదు అడుగుల పొడవు ఉంటున్నాయి.

రెయినీ సీజన్‌లో ఇంటి పక్కన ఉన్న చీమచింత చెట్టు కింద సొర పాదు పెరిగింది. ఇప్పడు సొర తీగ ఆ చెట్టు మొత్తం అల్లుకుపోయింది. చెట్టు నిండా కాయలు పడ్డాయి. అవి కూడా నాలుగైదు ఐదు అడుగుల పొడవు వరకు పెరుగుతున్నాయి. దీంతో ఆ చెట్టుకు వేలాడుతున్న కాయలను విచిత్రంగా చూస్తున్నారు స్థానికులు. బంధువులకు, ఇరుగు పొరుగువారికి బాగా పెరిగిన సొర కాయలను అందజేస్తున్నారు ఆ ఇంటి యజమానులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.