
అది ఆదివారం.. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం. సాధారణంగా కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు లేదా.. తమ సేల్స్ పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి కొన్ని షాప్‌లు. అదే క్రమంలోనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ షాప్ కూడా రూ. 4 వేలకే ల్యాప్‌టాప్ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే ల్యాప్‌టాప్.. ఇంకేముంది.. కుర్రాళ్ళు అంతా కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. దెబ్బకు ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
తెల్లవారుజాము నుంచి క్యూలైన్ ఆ షాప్ ముందు దర్శనమిచ్చింది. గంటలు గడుస్తున్న కొద్దీ రద్దీ విపరీతంగా పెరిగింది. అలా మొత్తం ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. ఇంత వేల సంఖ్యలో జనాలు గుమిగూడతారని షాప్ యజమానులు కూడా ఊహించలేదు. అక్కడ పరిస్థితులు అదుపు తప్పడంతో స్థానికులు పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రద్దీని నియంత్రించే ప్రయత్నం చేయగా.. అది సాధ్యం కాలేదు. దీంతో షాప్‌ను తాత్కాలికంగా మూయించారు.
భారీ లాభాల కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. కాగా, ఈ 4 వేల ల్యాప్‌టాప్ అయితే.. గీతే పదో.. ఇరవై మందికి ఉంటుంది. కానీ ఆ ప్రకటన వల్ల షాప్‌కు వచ్చిన వాళ్ల సంఖ్య ఎక్కువ. కానీ అలా ఇచ్చే ల్యాప్‌టాప్‌లు కూడా సరిగ్గా ఉండవు. అందుకే ఇలాంటి ఆఫర్లు ప్రకటించినప్పుడు ఒకట్రెండు సార్లు ఆలోచిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..