
Telangana Assembly Elections: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఎన్నికల ప్రచార సభల్లో చేసిన ఆరోపణలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కౌంటరిచ్చారు. మొదట్నుంచీ బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తున్నది కాంగ్రెసేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పైఉన్న ఓటుకు నోటు కేసు ఎందుకు తొక్కిపెట్టారని, ఆ కేసుపై దర్యాప్తు ఎందుకు జరగడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దని కిషన్ రెడ్డి రాహుల్‌కు సూచించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని.. 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు BRSలోకి వెళ్లారంటూ తెలిపారు. మజ్లిస్ మధ్యవర్తిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్-బీఆర్‌ఎస్-ఎంఐఎం డీఎన్‌ఏ ఒక్కటేనని.. ఎవరికి ఎవరు బీ టీమో తేల్చేందుకు రాహుల్ చర్చకు సిద్ధమా..? అంటూ కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారో చర్చ ద్వారా తేలుద్దామని.. తనతో చర్చకు రావాలంటూ కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు వస్తారో.. ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో చర్చిస్తారో మీరే నిర్ణయించండి.. మేం సిద్ధమే.. అంటూ సవాల్ చేశారు.
✅ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీ టీమ్ కాకపోతే ఓటు కు నోటు కేసులో దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎందుకు శిక్ష పడట్లేదు?
✅ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని పాలన కారణంగానే.. నాడు 1969లో.. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో వేల మంది తెలంగాణ విద్యార్థులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
✅… pic.twitter.com/wzMDkKbxJL— G Kishan Reddy (@kishanreddybjp) October 19, 2023
వీటన్నింటికంటే ముందు.. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం ముందు ముక్కు రాసి.. తెలంగాణ సమాజానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మందిని పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని కిషన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..