Telangana: ఆదిలాబాద్‌లో అవినీతి చేపలు.. ఆమ్యామ్యా తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కైన వైనం

| Edited By: Srilakshmi C

Jan 10, 2024 | 7:32 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాలో ఏసీబీ వరుస దాడులకు అవినీతి చేపలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాయి. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ కడెం ఎమ్మార్వో, డీటీ పట్టుబడగా.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ కాసిపేట పంచాయితీ..

Telangana: ఆదిలాబాద్‌లో అవినీతి చేపలు.. ఆమ్యామ్యా తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కైన వైనం
AE Paranjyoti
Follow us on

మంచిర్యాల, జనవరి 10: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాలో ఏసీబీ వరుస దాడులకు అవినీతి చేపలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాయి. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ కడెం ఎమ్మార్వో, డీటీ పట్టుబడగా.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ కాసిపేట పంచాయితీ రాజ్ ఏఈ పట్టుబడ్డారు.

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఎంపిడివో కార్యాలయంపై ఏసీబీ అదికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బాదితుని వద్ద నుండి 15 వేలు లంచం తీసుకుంటూ కాసిపేట పంచాయతీ రాజ్ ఏఈ పరంజ్యోతి ఏసీబీ అదికారులకు చిక్కారు. ఏఈ పాత పనికి బిల్లు కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏఈ పెర్కపల్లి పంచాయతీ సెక్రెటరీ వీరబాబు ద్వారా రూ. 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఏఈ పరం జ్యోతి, పెర్కపల్లి పంచాయతీ కార్యదర్శి వీర బాబును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అటు నిర్మల్ జిల్లాలోను ఇద్దరు అవినీతి అదికారులు ఏసీబీకి చిక్కారు. కడెం ఎమ్మార్వో కార్యలయంలో ఓ రైతు వద్ద నుండి 9 వేల రూపాయల లంచం తీసుకుండగా తహసీల్దార్ రాజేశ్వరితో పాటు డీటీ చిన్నయ్య ఏసీబీ అదికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించిన‌ వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్ది పడగా గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్న చెందిన 24 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి 15 వేలు ఎమ్మార్వో రాజేశ్వరీ డిమాండ్ చేయగా.. బాదితుడు ఏసీబీ అదికారులను‌ ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన‌ ఏసీబీ అదికారులు.. డిప్యూటీ ఎమ్మార్వో చిన్నయ్య బాదితుడి వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులను‌ కరీంనగర్ ఏసీబీ కోర్ట్ లో రిమాండ్ చేస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.