Watch Video: పొలం గట్లపై వింత ముద్రలు.. ఆ గ్రామాలో క్షణక్షణం భయం భయం!

కరీంనగర్ గ్రామాల చుట్టూ పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రైతుల పొలం గట్లపై పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు నిర్ధారించడంతో స్థానిక రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు, పనులు నిలిపివేశారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయట తిరగవద్దని హెచ్చరించారు.

Watch Video: పొలం గట్లపై వింత ముద్రలు.. ఆ గ్రామాలో క్షణక్షణం భయం భయం!
Karimnagar Tiger Sighting

Edited By:

Updated on: Dec 31, 2025 | 1:42 PM

కరీంనగర్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. నగరానికి సమీపంలోని ఉన్న చర్లబూత్కుర్, కొండాపూర్ ఐత్రాచుపల్లి చమనపల్లి, బహద్దూర్ ఖాన్‌పేట గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తున్న ప్రచారం జరగడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటాన స్థలానికి చేరుకొన్ని పరిశీలించారు. అయితే అక్కడ పులి పాదముద్రలు కనిపించడంతో పులిసంచరిస్తున్నట్టు పూర్తి నిర్ధారణకు వచ్చారు. దాని ఆచూకీని గుర్తించేందుకు పులి పాదముద్రలు సేకరించారు.

వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ మండలం బహుదర్ ఖాన్ పేటకు చెందిన కొందరు రైతులు తమ పొలాల్లో నాటు వేయడానికి పొలాను సిద్దం చేసుకున్నారు. అయితే ఇటీవల పొలానికి వెళ్లిన ఆ రైతులకు పొలం గట్లపై పులి సంచరించిన పాదముద్రలు కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్నారు అటవీశాఖ అధికారులు. అక్కడ ఉన్న పాదముద్రలను పరిశీలించి.. అవి పెద్దపులి పింట్స్‌గా నిర్ధారించారు. వాటిపై వైట్‌ పెయింట్‌ వేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

ఈ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుందని.. రైతులు ఎవరూ ఇటు వైపు ఒంటరిగా రావద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. దీంతో రైతులు భయంతో వణికిపోతున్నారు. ఇది పూర్తిగా మైదానం ప్రాంతం కావడంతో.. ఎప్పుడు ఎటువైపు నుంచి పులిదాడిని ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రైతులు వ్యవసాయ పనులకు వెళ్లడం మానేశారు. ఇదిలా ఉండగా స్థానిక మొక్కజొన్న తోటల్లోంచి అరుపులు వినిపించినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.