AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో అక్రమ ఫీజుల వసూళ్లపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొత్తం ఫీజును నాలుగున్నర సంవత్సరాలకే పరిమితం చేయాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా వసూలు చేస్తున్నట్లు భావించి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!
Medical Collage Fees
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Apr 08, 2026 | 4:29 PM

Share

తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో అక్రమ ఫీజుల వసూళ్లపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొత్తం ఫీజును నాలుగున్నర సంవత్సరాలకే పరిమితం చేయాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా వసూలు చేస్తున్నట్లు భావించి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చిరంచింది. కోర్సు వ్యవధి 4.5 సంవత్సరాలే అయినప్పటికీ, విద్యార్థులపై భారం తగ్గించే ఉద్దేశంతో ఫీజును ఐదు విడతలుగా మాత్రమే వసూలు చేయాలని యూనివర్సిటీ సూచించింది.

అయితే, దీనిని తప్పుగా అర్థం చేసుకుని ఐదు సంవత్సరాల ఫీజు పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారని, ఇది సరైంది కాదని యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఫెయిల్ అయిన లేదా డిటైన్ అయిన విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడం, ముందస్తుగా మొత్తం ఫీజులు తీసుకోవడం కూడా నిషేధమని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో యూనివర్సిటీ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోటా విద్యార్థుల నుంచి ఐదు సంవత్సరాల ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే అనుబంధాన్ని రద్దు చేసే అవకాశముందని పేర్కొంది.

ఇక తెలంగాణ ప్రవేశాలు – ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన ఫీజు నిర్మాణం ప్రకారం.. 9 సెమిస్టర్ల కోర్సుకు 2023–2026 కాలానికి ఫీజులను ఐదు సమాన విడతలుగా విభజించారు. ఉదాహరణకు.. సంవత్సరానికి రూ.14.50 లక్షల ఫీజు ఉంటే, మొత్తం కోర్సు ఫీజు రూ.65.25 లక్షలుగా అంటే నాలుగున్నర సంవత్సరాలకు నిర్ణయించారు. దీన్ని ఐదు విడతలుగా విభజించి ప్రతి ఏడాది రూ.13.05 లక్షల చొప్పున మాత్రమే వసూలు చేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని కెరీర్ & ఉద్యోగాలు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చేదులోనే ఉంది మహా ఆరోగ్యం.. వేప వల్ల కలిగే ఈ అద్భుత ప్రయోజనాలు
చేదులోనే ఉంది మహా ఆరోగ్యం.. వేప వల్ల కలిగే ఈ అద్భుత ప్రయోజనాలు
సెంచరీతో వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!
సెంచరీతో వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!
అయ్యో పాపం.. బిగ్ బాస్ షాలినీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..?
అయ్యో పాపం.. బిగ్ బాస్ షాలినీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..?
వినాయకుడికి ఇష్టమైన పాలతాలికలపాయసం..ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలంటే
వినాయకుడికి ఇష్టమైన పాలతాలికలపాయసం..ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలంటే
రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్-వరంగల్ రూట్‌లో..
రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్-వరంగల్ రూట్‌లో..
క్రేన్లు, జేసీబీలు వచ్చినా కదలని హనుమాన్..!
క్రేన్లు, జేసీబీలు వచ్చినా కదలని హనుమాన్..!
అప్పుడు దాచుకున్న ఈ గింజలు.. ఇప్పుడు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?
అప్పుడు దాచుకున్న ఈ గింజలు.. ఇప్పుడు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?
ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశా.. కానీ ఆ హీరో గ్యాంగ్ వచ్చి..
ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశా.. కానీ ఆ హీరో గ్యాంగ్ వచ్చి..
ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక..
ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక..
ప్రపంచ క్రికెట్ లోనే పరమ వరస్ట్ టీం ఇదే..!
ప్రపంచ క్రికెట్ లోనే పరమ వరస్ట్ టీం ఇదే..!