
ఇక్కడ ఎవరి ఇరిగేషన్ వాళ్లదే. దాదాపు లక్షకోట్ల విలువైన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్ట్.. ఇప్పుడొక కామెడీ ఎపిసోడ్‌గా మారిపోయింది. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, కొంప కొల్లేశ్వరం అని సూటిపోటి మాటలతో ఎవరి కటింగులు వాళ్లిస్తున్నారు. సీజనుకోసారి రాజకీయ పార్టీలు కొట్లాడుకోడానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్‌గా మాత్రమే పనికొస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు. కట్టినవాళ్లకు ఎంతటి అమూల్యమైన ప్రాజెక్టో, తర్వాత పవర్లోకొచ్చిన వీళ్లకు మాత్రం అంతకంటే అనాకారీ ప్రాజెక్ట్ ఐపోయింది. గ్రౌండ్‌లో రైతుజనాభా అభిప్రాయాలకు విరుద్ధంగా పరస్పరం పొలిటికల్ కుమ్ములాటలకే పరిమితమైంది కాళేశ్వరం. కారు పార్టీ వర్సెస్ క్యాబినెట్ మంత్రులు.. మధ్యలో కమలం సార్లు.. కుమ్మేసుకుందాం రేంజ్‌లో నడుస్తోంది తెలంగాణలో సాగు రాజకీయం.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాల్సిందేనని బీఆర్‌ఎస్ పార్టీ, డ్యామ్‌సేఫ్టీ అధికారుల హెచ్చరికల్ని బేఖాతరు చేసి నీళ్ళు ఎలా వదులుతామని హస్తం పార్టీ.. రెండూ కలిసి డ్రామాలాడుతున్నాయని కమలం పార్టీ…! టీ-పాలిటిక్స్‌లో వద్దన్నకొద్దీ ఉట్టిపడుతోంది జలకళ. నీళ్లు-నిలదీతలు- నిరసనల నిప్పుతో అట్టుడుగుతోంది తెలంగాణ. మంత్రులు-మాజీ మంత్రులే ఇరిగేషన్ ఇంజనీర్ల అవతారమెత్తి, నీటి విడుదలపై సొంత పెర్ఫామెన్సులతో ఇరగదీస్తున్నారు, మీడియా మీటింగులు పెట్టి అదేపనిగా లెక్చర్లు దంచికొడుతున్నారు. ఎవరికి వాళ్లు జల ఫిరంగుల్ని సంధిస్తున్నారు. కేటీఆర్ కన్నెపల్లి టూరుతో మళ్ళీ మొదలైంది అసలు రచ్చ. కాళేశ్వరం ప్రాజెక్టులో...