Kadiyam Srihari: ప్రజా సేవకు పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదు.. ఎమ్మెల్యే రాజయ్యపై.. మాజీ ఎమ్మెల్సీ కడియం ఫైర్

|

Jun 26, 2021 | 4:07 PM

Kadiyam Srihari on MLA T Rajaiah: ప్రజా సేవ చేయడానికి పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదంటూ.. టిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మాజీ ఎమ్మెల్సీ కడియం

Kadiyam Srihari: ప్రజా సేవకు పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదు.. ఎమ్మెల్యే రాజయ్యపై.. మాజీ ఎమ్మెల్సీ కడియం ఫైర్
Kadiyam Srihari
Follow us on

Kadiyam Srihari on MLA T Rajaiah: ప్రజా సేవ చేయడానికి పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదంటూ.. టిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శ్రీహరి.. రాజయ్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కడియం శ్రీహరి పదవీకాలం ఇటీవల జూన్ 2న ముగిసిందని.. కడియంకు ప్రొటోకాల్ లేదంటూ తాటికొండ రాజయ్య పేర్కొనడంతో.. ఆయన ఈ విమర్శలు చేశారు. అయితే దీనిపై వెంటనే కడియం శ్రీహరి స్పందించారు. జూన్ 2తో నా పదవీకాలం ముగిసింది. ప్రజాసేవ చేయడానికి పదవులు, ప్రొటోకాల్ అవసరం లేదు.. నియోజకవర్గానికి రావడానికి ఎవరి లైసెన్స్ , అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని బహిరంగంగా ధ్వజమెత్తారు.

తనకి రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు పదవి ఉన్నా, లేకున్నా అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. ప్రజలకు మేలుచేసే పనులు ఎవరు చేసిన స్వాగతించి, అభినందించాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయానికి మాత్రమే కట్టుబడి ఉంటాని తెలిపారు. కడియం శ్రీహరి నిజాయితీగా పని చేస్తాడని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటాడని ప్రజల్లో తనకు మంచి గుర్తింపు ఉందంటూ పేర్కొన్నారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదుల పట్ల అవగాహన లేనివారు కూడా హడావుడి చేయడం విడ్డురంగా ఉందంటూ రాజయ్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read:

BJP Meeting in Delhi : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ.. ఢిల్లీలో పార్టీ పెద్దలతో కీలక సమావేశం..

The Black Tiger: పాకిస్థాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసి.. కొలీగ్ చేసిన పనికి దొరికి 16 ఏళ్ళు నరకం చూపించినా రహస్యం చెప్పని వీరుడు ఎవరో తెలుసా