
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటివరకు 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయ్యింది. ఈ 6 రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 15 వేలకు పైగా ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వస్తుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీభవన్‌లో బాణసంచా కాల్చి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాసేపట్లో మంత్రులు సైతం గాంధీభవన్ వెళ్లనున్నారు.
ఇక ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ఆఫీస్‌లోనూ కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మండల, జిల్లా కేంద్రాల్లో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు షేక్‌పేట్, వెంగళ్‌రావు నగర్, రెహమత్ నగర్ డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఈ మూడు డివిజన్లలోనూ కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యత వచ్చింది.