Watch Video: ఇక నో టెన్షన్.. చింపాంజీలు వచ్చేస్తాయ్.. కోతుల నివారణకు భలే ఐడియా

జనగామలో మున్సిపల్ అధికారులు కొత్త వేషాలతో విధులు నిర్వహిస్తున్నారు.. చింపాంజీ వేషాలు ధరించి గల్లి గల్లిలో పరుగులు పెడుతున్నారు.. ఇంతకీ మున్సిపల్ సిబ్బంది చింపాంజీ వేషం ఎందుకు వేసుకున్నారో తెలుసా..! చింపాంజీ వేషానికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..! జనగామ మున్సిపాలిటీలో హాట్ టాపిక్ గా మారిన మున్సిపల్ సిబ్బంది పగటివేషాలపై స్పెషల్ స్టోరీ చదవండి..

Watch Video: ఇక నో టెన్షన్.. చింపాంజీలు వచ్చేస్తాయ్.. కోతుల నివారణకు భలే ఐడియా
Jangaon's Unique Monkey Menace Solution

Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 27, 2025 | 1:34 PM

కోతుల బెడద నుండి విముక్తి కోసం మున్సిపల్ అధికారులు మెదడుకు పదును పెడుతున్నారు..ఇంతకు మించిన మార్గం లేదని సరికొత్త ఆలోచనలతో కోతులను భయపెట్టి తరిమేందుకు వింత వింత వేషాలు వేయాల్సి వస్తుంది..ఈ మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా కోతులను తరిమేసేందుకు సిబ్బందిని నియమించి వారికి చింపాంజీ వేషం వేసి పట్టణమంతా తిప్పుతున్నారు.. చింపాంజీ వేషధారణతో కోతులను తరిమేసి తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు.. మున్సిపల్ సిబ్బంది పగటి వేషాలు, చింపాంజీ వేషధారణ అక్కడ పట్టణమంతా హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పటివరకు మనుషులను భయపెట్టే చింపాంజీలని మాత్రమే చూశాం.. కానీ ఇక్కడ మాత్రం కోతులను భయపెట్టేందుకు మున్సిపల్ సిబ్బంది పగటివేషాలు వేయాల్సి వచ్చింది.. చింపాంజీ మాస్కుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి మాస్కులు ధరించాల్సిన దుస్థితి ఏర్పడింది.. చింపాంజీ వేషాలు వేసుకున్న జనగామ మున్సిపల్ సిబ్బంది కోతులను పరుగులు పెట్టిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నానా తంటాలు పడుతున్నారు.

జనగామ పట్టణం చుట్టూ గుట్టలు ఎక్కువగా ఉండటంతో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వేలాది కోతులు పట్టణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి.. ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది.. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. కోతుల నుండి మా ప్రాణాలు కాపాడండి మొర్రో అని వేడుకుంటున్నారు.. వానరసేనల దాడుల నుండి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు జనగామ మున్సిపల్ శాఖ అధికారులు ఇంతకు మించిన మార్గం కనిపించలేదు.. వినూత్న ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుంది.. మున్సిపల్ కమిషనర్ కు వచ్చిన ఆలోచనతో కోతులను భయపెట్టేందుకు చింపాంజీ రూపంలో సిబ్బందికి వేషాలు వేయించారు.. ప్రత్యేకంగా నిధులు వెచ్చించి చింపాంజీ మాస్క్ లు తెప్పించారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు ఇలా చింపాంజీ వేషాలు ధరించి కోతులను పరుగులు పెట్టిస్తున్నారు.. ఎక్కువగా కోతులు సంచరించే బతుకమ్మకుంటతో పాటు, అన్ని కాలనీలో ఇలా చింపాంజీ వేషాలు ధరించి కోతుల వెంట పడుతున్నారు.

వీడియో చూడండి..

చివరకు మున్సిపల్ అధికారుల ప్రయత్నం ఫలించింది.. చింపాంజీ వేషధారణలో సిబ్బంది పరుగులు పెడుతూ.. కోతులను హడలెత్తిపోయేలా చేస్తున్నాయి.. చింపాంజీ వేషధారణలో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న హావభావాలు.. చేష్టలు చూసి భయంతో కోతులు తుర్రుమని పారిపోతున్నాయి.. సిబ్బందికి వేషాలు ధరించడం కాస్త ఇబ్బందిగా ఉన్న కోతుల నుండి ప్రజలకు విముక్తి లభించడంతో అధికారులు సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ ఐడియా అదుర్స్ అని ప్రజలు అంటుంటే…కోతుల సమస్య పరిష్కారానికి మాకు ఇంతకు మించిన మార్గం కనిపించలేదని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..