
ఓ వారం క్రితం.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌పై స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ రైడ్ చేసింది. ఏం లేదు.. సరదాగా పార్టీ చేసుకుంటున్నారంతే. అదే పార్టీలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి సైతం కనిపించారు. ఆ పర్సనాలిటీస్ అక్కడ కనిపించే సరికి పోలీసులు చేసిన ఆ రైడ్ హైలైట్ అయింది. కాని, ఈమధ్య ఇలాంటి పార్టీలపై డేగ కళ్లతో నిఘా వేసి ఉంచుతున్నారు ఖాకీలు. అది చిన్నపాటి బర్త్‌డే పార్టీ అయినా సరే. ఇట్టే వాసన పసిగట్టేస్తున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. జస్ట్ ఓ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ ఊరవతల ఓ రిసార్ట్‌లో పార్టీ జరిగింది. కాస్త పెద్దోళ్లే ఉన్నారా ఈవెంట్‌లో. అక్కడా రైడ్స్ జరిగాయ్, అదుపులో తీసుకోవడమూ జరిగింది. ఇలా ఎక్కడ పార్టీ జరిగినా సరే.. పట్టేస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ టీమ్స్ ఉన్నాయ్. మఫ్టీలో తిరుగుతూ అబ్జర్వ్ చేసే బ్యాచ్‌లున్నాయ్. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలంటే.. రాబోయే న్యూఇయర్ కోసం హైదరాబాద్ పోలీసులు ఓ స్ట్రాంగ్ మెసేజ్ పంపించదలచుకున్నారు. ‘పార్టీ చిన్నదా పెద్దగా అని కాదు.. ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా’. ‘రూల్స్ పాటిస్తున్నారా లేదా’. ఇదొక్కటే చూస్తున్నారు. న్యూఇయర్ రోజు హడావుడి చేయడం కాకుండా.. దాదాపు 15, 20 రోజుల ముందే అవేర్‌నెస్ తీసుకొస్తున్నారు. ఒకవిధంగా ‘డోంట్ బ్రేక్ ద రూల్స్’ అనే వార్నింగ్స్ ఇస్తున్నారు. న్యూఇయర్ కోసం స్పెషల్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. బాగా ఎంజాయ్ చేయండి, ఎంతైనా ఆనందించండి.....