Tealngana: భారీ వర్షాల నేపథ్యంలో రంగంలోకి సీఎం కేసీఆర్‌.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ..

|

Jul 27, 2023 | 10:48 PM

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి...

Tealngana: భారీ వర్షాల నేపథ్యంలో రంగంలోకి సీఎం కేసీఆర్‌.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ..
Cm Kcr
Follow us on

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు గురువారం ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు ఇందుకు సంబంధించి పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలని సీఎం కోరారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ మంత్రులకు ఫోన్లలో ఆదేశించారు.

తక్షణ రక్షణ చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాలను అనుసరించి అన్ని రకాల చర్యలను చేపడుతూ సీఎస్ సెక్రటేరియట్ లో అధికారులతో సమీక్షా సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎస్ బృందాలు, రక్షణచర్యల కోసం హెలికాప్టర్లు సహా, ఆహారం, వైద్యం తదితర రక్షణ సామాగ్రి, సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపించేలా చర్యలు చేపట్టారు.
విపత్తుల నిర్వహణ శాఖకు, ఫైర్ సర్వీసుల శాఖకు, పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు.
అదే సందర్భంలో పోలీస్ యంత్రాంగాన్ని సహాయక చర్యల్లో పాల్గొనేలా అప్రమత్తం చేయాల్సిందిగా రాష్ట్ర డిజిపిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ లెవల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి.డిజిపి పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తున్నది.

ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు…

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంకలు ప్రమాద హెచ్చరికలు దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో, వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలనీ, ఈ మేరకు ఇన్ ఫ్లో ను ముందస్తు అంచనా వేసి, గేట్లు ఎత్తివే స్థూ, వరద నీటిని కిందికి వదలాలని చీఫ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టులు, కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, లోయర్ మానేరు తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్లు చేసి, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మంత్రులకు ఆదేశాలు…

రాష్ట్రంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రాణనష్టం జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి పరిధిలో విస్తృతంగా పర్యటన చేపట్టారు. వానలోనే తడుస్తూ, ప్రజలను పరామర్శిస్తూ, అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూ రక్షణ చర్యల కోసం ముందుకు సాగారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయ చర్యలను చేపట్టేలా జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశాలిచ్చారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించి ప్రజలకు భరోసానిచ్చారు. జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనెలా చర్యలు చేపట్టారు.

సీఎం కేసీఆర్ మంత్రి సత్యవతి రాథోడ్ కు ఫోన్ చేసి గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన మోరంపల్లి గ్రామంలో ప్రజలను రక్షించేలా పరిస్థితిని సమీక్షించారు. స్వయంగా చలివాగుతో పాటు వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగు ముంపు ప్రాంతంలో కొనసాగుతన్న సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించి, అక్కడే బస చేస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి, పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి ప్రజలకు ఆహారం, దుస్తులు అందించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ అత్యవసర వైద్య సదుపాయాలు అందించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరావాస సహాయక చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ స్థానిక పరిస్థితులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ విజయలక్షి, అధికారులతో సమీక్షించారు.

కడెం ప్రాజెక్టు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్టు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులను ఆరా తీశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉదయం భద్రాచలంలో ప్రత్యేకాధికారి అనుదీప్ తో కలిసి గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. ఖమ్మం జిల్లా మున్నేరువాగులో చిక్కుకున్న వారిని రక్షిచేందుకు స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకు సంబంధించి మంత్రి పువ్వాడతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..