Black Magic: ప్రపంచం మొత్తం మారుతున్నా.. కొందరు జనాల తీరు మాత్రం మారడం లేదు. యావత్ ప్రపంచం సైన్స్‌ను ఆసరాగా చేసుకుని అభివృద్ధి పథంవైపు దూసుకుపోతుంటే.. ఇక్కడ మాత్రం పాతకాలం నాటి మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. అవేవీ పట్టడం లేదు. ఈ మూఢనమ్మకాల పిచ్చిలో కన్న బిడ్డలను సైతం కడతేరుస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు రోజూ ఎక్కడోచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతమే.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మోతే మండలం మేకలపాడు తండాలో వెలుగు చూసింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన తాలూకు వివరాలు తెలిస్తే షాక్ అవుతారంటే అతిశయోక్తి కాదు.
మేకపాడు తండాకు చెందిన ఓ మహిళకు ఆరు నెలల పసిపాప ఉంది. ఆ మహిళకు మూఢవిశ్వాసాలు అధికం. ఈ నేపథ్యంలోనే తాను జన్మనిచ్చిన చిన్నారికి జ్యోతిష్యం చూపించగా.. నాగసర్ప దోసం ఉందని చెప్పారు. దానిని విశ్వసించిన సదరు మహిళ.. నాగసర్ప దోషం ఉందనే కారణంతో తన సొంతబిడ్డ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా హతమార్చింది. శివుని బొమ్మను పక్కన పెట్టుకుని ఆరు నెలల పసిపాప గొంతు కోసి చంపేసింది. అదేమంటే.. నాగసర్ప దోష నివారణ కోసం అంటూ బుకాయించింది. ఈ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి గొంతు కోసం చంపిన కసాయి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
Also read:
ఎల్‌ఐసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! పెరగనున్న జీతాలు, అలవెన్స్‌లు.. ఈ వారంలో కేంద్రం నిర్ణయం..?
Mumbai Couple: 2019 ఖతార్ డ్రగ్స్ కేసులో ముంబై జంట అరెస్ట్.. తాజాగా నిర్దోషులకుగా ఇండియాలోకి అడుగు..
Coronavirus: కరోనా కట్టడికి ఇవి కీలకం.. తాజా పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడించిన అమెరికా పరిశోధకులు