Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విడిసిల అరాచకం.. కూలీ పెంచమన్నందుకు 70 దళిత కుటుంబాల బహిష్కరణ..

|

Aug 26, 2021 | 10:11 PM

Nizamabad: ద‌ళితుల కోసం ఓ వైపు స‌ర్కార్ విశేష‌మైన సేవలు చేస్తోంది. ద‌ళితబంధు లాంటి ప్రతిష్టాత్మక ప‌థ‌కాలను ప్రవేశపెడుతోంది. దళితులు ఉన్నత శిఖరాలు చేరాలని..

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విడిసిల అరాచకం.. కూలీ పెంచమన్నందుకు 70 దళిత కుటుంబాల బహిష్కరణ..
Nizamabad
Follow us on

Nizamabad: ద‌ళితుల కోసం ఓ వైపు స‌ర్కార్ విశేష‌మైన సేవలు చేస్తోంది. ద‌ళితబంధు లాంటి ప్రతిష్టాత్మక ప‌థ‌కాలను ప్రవేశపెడుతోంది. దళితులు ఉన్నత శిఖరాలు చేరాలని, సమాజంలో వారికంటూ ప్రత్యేక ఉండాలని ఆకాంక్షిస్తోంది. అయితే, ప్రభుత్వాలు ఇంత చేస్తున్నా.. జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. కులం, మతం పేరిట సాటి మనుషులపై వివక్ష ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆ జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వివక్షలు, బహిష్కరణల పర్వం సాగుతోంది. దళితులు నోరెత్తి మాట్లాడితే, కనీస కూళీ పెంచమని అడిగితే వేటు తప్పదు. నీళ్లు, విద్యుత్తు అన్నీ కట్ అవుతాయి. మీరేంత మీ బ్రతుకేంత అనే ప్రశ్నలు ఉత్పన్నమ‌వుతాయి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా లో అదే జ‌రుగుతుంది.. ద‌ళితుల కుల‌వృత్తి అయిన డ‌ప్పులు కొట్టెందుకు రూ. 500 కూలీ పెంచ‌మ‌న్నందుకు 70 ద‌ళిత కుటుంబాల‌ను బ‌హిష్కరించిది నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండలం దూస్‌గావ్ విడిసి. ఈ చర్య ద్వారా మ‌రోసారి గ్రామాబివృద్ది క‌మీటిల ఆరాచకాన్ని చూపించింది.

దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని.. గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని ఎందరో మహనీయులు గ్రామాల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కానీ నేటి సమాజంలో పట్టణాల కంటే గ్రామాల్లో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్నేళ్ల కిందట ప్రతి గ్రామంలో గ్రామస్తులందరూ ఏకమై ప్రభుత్వం చేసే అభివద్ధితోపాటు తమ గ్రామాలను తామే మరింత అభివృద్ధి దిశగా నడిపించుకోవాలనే ఉద్దేశంతో గ్రామాభివద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లోనే కాకుండా గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకునేవారు. కానీ ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో గ్రామాబివృద్ధి క‌మీటిలు స‌మాంత‌ర స‌ర్కార్ లుగా మారుతున్నాయి. తాము చేప్పిందే వేదం లేకుంటే బ‌హిష్కర‌ణే అన్న చందంగా ఆరచాకాలు చేస్తున్నాయి. గ్రామాబివృద్ధి పేరిట ల‌క్షలకు ల‌క్షలు వ‌సూళ్లకు పాల్పడుతూ మాట వినని వారిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తూ బ‌హిష్కర‌ణ వేటు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండలం దూస్‌గావ్ గ్రామంలో 70 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ దళితులు.. తమ గ్రామంలో డ‌ప్పులు కోట్టుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. అయితే, గ్రామంలో చాల కాలంగా డ‌ప్పులు కోట్టేందుకు ఒకే రేటు ఉండ‌టంతో అది గిట్టుబాటు కావడం లేద‌ని, మ‌రో రూ. 500 పెంచాల‌ని కోరారు. వాళ్లు అలా కోరడమే ఆలస్యం.. ఆ విన్నపమే గ్రామాభివృద్ది క‌మీటికి కోపం తెప్పించింది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ 70 కుటుంబాల‌ను బహిష్కిరించారు. 500 పెంచ‌డం ఏంటీ..? మేము చేప్పిన రేటుకే డప్పు కోట్టాలి. లేదంటే వేరే గ్రామానికి చెందిన వాళ్లతో కోట్టించుకుంటాం అంటూ వీరిని గ్రామ బహిష్కరణ చేసారు.

గ్రామాభివృద్ధి కమిటీ చర్యతో ఈ గ్రామానికి చెందిన ద‌ళితులంతా క‌లిసి క‌లేక్టరేట్ మెట్లు ఎక్కారు. త‌మ‌ను గ్రామ బ‌హిష్కర‌ణ చేసి వివ‌క్ష చూపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామ బ‌హిష్కర‌ణకు గురైన తమపై విడిసి అరాచ‌కంగా వ్యవహరిస్తోందని బాధితులు వాపోయారు. తీవ్రమైన వివ‌క్ష చూపిస్తున్నారని అన్నారు. ద‌ళిత వాడ‌ల్లోకి రావ‌ల్సిన నీళ్లు ఆపేయడంతో పాటుగా వీది లైట్లను కూడా తీసేసార‌ని ఆరోపించారు. ఆంతే కాకుండా త‌మ వారిని ప‌నుల‌కు కూడా పిల‌వ‌కుండా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశఆరు. తాము చేసిన పనికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. త‌మతో ఎవ‌రు మాట్లాడినా వారికి జ‌రిమానా విధిస్తామ‌ని భ‌య‌పెడుతున్నారని అన్నారు. ఓవైపు ప్రభుత్వం ద‌ళితుల సాధికార‌త అని చేపుతుంటే.. మ‌రో వైపు వీళ్లు మాత్రం త‌మ‌ను అంట‌రాని వారిగా చూస్తున్నార‌ని బాధితులు ఫైర్ అవుతున్నారు. కాగా, బాధితుల ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్.. ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇదిలాఉంటే.. ఈ వ్యవహారంపై విడిసి స్పందించింది. ‘‘గ్రామంలో గత కొత్త గ్రామ పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి దళితులను 5సార్లు కూర్చోబెట్టి చర్చలు జరిపినా డప్పులు వాయించాలంటే తాము పెంచిన 500 రూపాయలు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. తాము చర్చలకు పిలిచినా వారు రాలేదు. గ్రామంలో శుభకార్యాలు జరుగుతున్నందున ఇతర గ్రామాల నుంచి డప్పులు వాయించడానికి తీసుకువచ్చాం. ఇంతలోనే తమకు అన్యాయం జరిగిందని, గ్రామ బహిష్కరణ చేశారని దళిత కుటుంబ సభ్యులు నిజామాబాద్ కలెక్టరు కార్యాలయానికి వెళ్లారు. దూస్‌గామ్ గ్రామంలో ఉద్దేశపూర్వకంగా ఎవరినీ గ్రామ బహిష్కరణ చేయలేదు. తాము అంతా కలిసి మెలిసి ఉన్నాం.’’ అని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ చెప్పుకొచ్చారు.

Also read:

Dalitha Bandhu: దేశానికే ఆదర్శం దళితబంధు పథకం.. లబ్ధిదారులకు వాహనాలు అందజేసిన మంత్రులు..

Vijayanagaram: విజయనగరంలో మునిసిపల్ అధికారుల ఓవరాక్షన్.. పీఠల మీది పెళ్లిని ఆపి మరీ..

Telangana Dalitha Bandhu: దళిత రాగం తీస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.. పాలనలో ఊహించని మార్పులు..!