Weather Report: ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఏరోజూ ఎలా ఉండబోతుంది!

IMD forecast Telugu states: గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తు్న అకాల వర్షాలు వేసవి ఎండల నుంచి జనాలకు కాస్త ఉపశమనం కలిగించాయని అనుకునే లోపే భారత వాతవరణశాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండ్రోజులు తేలికపాటు వర్షాలు కురుస్తాయని.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

Weather Report: ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఏరోజూ ఎలా ఉండబోతుంది!
Telangana Ap Weather Report

Updated on: Mar 20, 2026 | 3:47 PM

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎండవేడి నుంచి కాస్త ఉపశమనం దొరికందనుకున్న తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రెండ్రోజులు వర్షాలు కురువబోతున్నప్పటికీ.. ఇతర్వాతి రెండ్రోజుల్లో ఉష్ణో్గ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్ యానం తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలో సగటు సముద్రమట్టం నుండి 3.1 కి మీ ఎత్తులో కొనసాగుతోందని. నిన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి దక్షిణ అంతర్గత కర్నాటక వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్నాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్నాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులు పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రాబోయే మూడు రోజులు తెలంగాణ వెదర్

హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర ప్రకారం.. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని.. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు మరియు 30 నుండి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులుతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాతి నాలుగు రోజులలో సాధారణ స్థాయి నుంచి క్రమేపీ రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

రాబోయే 3 రోజుల ఉత్తర కోస్తా వెదర్

ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతున్నదని.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే వర్షం సమయంలో గంటకు 40 -50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్లు వేగముతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

రాబోయే 3 రోజుల రాయలసీమ వెదర్

ఇక రాలసీమలోని కొన్ని జిల్లాల్లోనూ రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని.. వర్షం సమయంలో గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us