Heatwave: ఇకపైనే అసలు ఎండకాలం.. తెలుగురాష్ట్రాలకు భారీ హెచ్చరికలు.. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్!

ఓ వైపు నైరుతు రుతుపవనాలు ఈ నెల 26నే కేరళా తీరాన్ని తాకుతాయి, ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా ఉంటుదనే వార్తలతో జనాలంతా హాయిగా ఉంటే.. ఇంతలోనే భారత వాతావరణ శాఖ మరో బాంబ్‌ పేల్చింది. నేటి నుంచి రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవ్వున్నట్టు పేర్కొంది. ఇకపైనే అసలుసిసలైన ఎండాకాలం మొదలవబోతోందని స్పష్టం చేసింది.

Heatwave: ఇకపైనే అసలు ఎండకాలం.. తెలుగురాష్ట్రాలకు భారీ హెచ్చరికలు.. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్!
Telugu States Temperatures

Updated on: May 18, 2026 | 10:12 AM

ఈ ఏడాది వేసవి కాలం మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. సాయంత్రం అవ్వగానే వాతావరణం చల్లబడి వర్షాలు కురిసేవి. కానీ రాబోయే రోజుల్లో మాత్రం సీన్ మారబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరతాయని, అలాగే వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయని తెలిపింది.

రాబోయే రోజుల్లో తెలంగాణలో క్రమక్రమంగా ఉష్ఱోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 44 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందిన ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ఇక ఏపీలోనూ తెలంగాణ తరహాలోనే వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో మంగళవారం నుంచి రాబోయే వారం రోజుల పాటు అంటే ఈ నెల 24 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటే అవకాశం చెప్పుకొచ్చింది. ఈ రోజులు దాదాపు 21 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు,మార్కాపురం, ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప,తిరుపతి జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి 42-44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.

మరోవైపు విదర్భ పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం.. కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us