Bandi Sanjay: లెక్కలు తెలియకుంటే తెలుసుకో.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

తెలంగాణకు కేంద్రం వాటాలు, పథకాల రూపంలో ఏమిస్తుందో గణాంకాలతో సహా వివరించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. గద్వాల జిల్లాలో ఆయన ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. నేటి యాత్ర ముగింపు..

Bandi Sanjay: లెక్కలు తెలియకుంటే తెలుసుకో.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌
Bandi Sanjay

Updated on: Apr 21, 2022 | 10:38 PM

తెలంగాణకు కేంద్రం వాటాలు, పథకాల రూపంలో ఏమిస్తుందో గణాంకాలతో సహా వివరించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌(BJP Chief Bandi Sanjay). గద్వాల జిల్లాలో ఆయన ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. గురువారం యాత్ర ముగింపు సందర్భంగా తేరు మైదాన్‎లో బహిరంగ సభ నిర్వహించారు. లెక్కలు తెలియకుంటే నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ అమలవుతున్న చాలా పథకాలకు మోదీ ప్రభుత్వం నిధులిస్తుందన్నారు బండి సంజయ్. ఎంతో సహకరిస్తుంటే.. ఏమీ ఇవ్వలేదని అంటారా అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఆగడాలు చెల్లబోవన్నారు బండి సంజయ్. గూండాల చేతిలో గాయపడ్డ అధికారులకు ప్రమోషన్లు ఇస్తామన్నారు. నడిగడ్డ ప్రాంతవాసులకు తీపికబురు అందించారు బండి సంజయ్‌. ఆర్డీఎస్‌తో ఆరునెల్లలో నీళ్లందేలా కేంద్రం జీవో ఇచ్చిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో గడిలు బద్దలు కొట్టి బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనది ప్రజాసంగ్రామయాత్ర కాదని.. ఆర్డీఎస్ విజయోత్సవ సభ అని చెప్పారు. తెలంగాణలో ఎక్కడ చూసినా సమస్యలే. 12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు వస్తలేవు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదు. కేంద్రం నిధులు ఇవ్వట్లేదని అబద్దాలు చెబుతూ ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి: AP: ఫీజు కట్టాలంటూ అందరి ముందు అవమానించారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారులు..

Rain: హైదరాబాద్‌లో ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షం.. నగరవాసులకు కాస్త ఉపశమనం..

Loading...
Unable to load recommendations.
Follow Us