
ఐబొమ్మ రవి జైల్లో ఉన్నా పైరసీ సినిమాలు మాత్రం ఆగడం లేదు.. ఐబోమ్మ పోతే.. ఇంకో బొమ్మ అన్నట్టు.. సరికోత్త వెబ్‌సైట్‌లను సృష్టించి పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు కేటుగాళ్లు. ఒక వెబ్‌సైట్ లింక్.. ఇంకో సైట్లో పేస్ట్ చేస్తే లేటెస్ట్ మూవీలు చూడొచ్చు. ఇది పైరసీగాళ్ల లేటెస్ట్ టెక్నాలజీ. అది కూడా ఐబొమ్మ, బప్పం సైట్లలో ఉన్న క్వాలిటీ సినిమాలను చూపించేస్తున్నారు పైరసీ క్రిమినల్స్. ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని అరెస్ట్ అయ్యారు.. ఐబొమ్మ సైట్‌ను ఎత్తేశారు. ఇక పైరసీ బెడద వీడినట్టే అని అనుకునే లోపే మళ్లీ ఆన్‌లైన్‌లో ఈ పైరసీ మూవీలు దర్శనమిస్తున్నాయి.
ఐబొమ్మను ఎత్తివేయడంతో ఈ కొత్త టెక్నాలజీని తెరపైకి తీసుకొచ్చిన ఐబొమ్మ, బప్పం సైట్లు.. SBI టెర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో కొత్త పైరసీ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో సినిమా చూడాలంటే.. ముందుగా.. బొప్పం టీవీ నుంచి మూవీ లింక్స్ కాపీ చేసుకొని.. వాటిని ఎస్‌బీఐ టెర్మ్ ల్యాప్స్ పేరితో ఉన్న వెబ్‌సైట్ పోర్టల్ ఓపెన్ చేసి.. SBI టర్మ్ ఇన్సూరెన్స్ సైట్లో పేస్ట్ చేస్తే సినిమా చూసేలా టెక్నాలజీని రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా పైరసీ అనేది బిగ్ వైరస్. ఇంటర్నెట్ ఉన్నంతకాలం ఇది ఉంటుందని మరోసారి నిరూపిస్తున్నారు పైరేట్స్. ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లు మూతపడినా.. వాటి ద్వారా వేరే సైట్లు క్రియేట్ చేసి.. సినిమాలను ప్రదర్శిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి