Hyderabad: ప్రాణం తీసిన లోన్‌ యాప్.. వేధింపులు తాళలేక యువకుడి బలవన్మరణం..

|

Apr 19, 2022 | 12:44 PM

Loan app managment harrasments: లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. రుణాలు తీసుకున్న వారిని తీవ్రంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు హైదరాబాద్‌లో మరో యువకుడు బలయ్యాడు.

Hyderabad: ప్రాణం తీసిన లోన్‌ యాప్.. వేధింపులు తాళలేక యువకుడి బలవన్మరణం..
Loan App
Follow us on

Loan app managment harrasments: లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. రుణాలు తీసుకున్న వారిని తీవ్రంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు హైదరాబాద్‌లో మరో యువకుడు బలయ్యాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) లో మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ జియాగూడకు చెందిన రాజ్‌కుమార్‌.. ఆన్‌లైన్‌ యాప్‌ (Loan app) లో 12వేల రూపాయల లోన్‌ తీసుకున్నాడు.. EMI ద్వారా 8వేలు చెల్లించాడు. మిగిలిన 4వేలు వెంటనే చెల్లించాలంటూ లోన్‌యాప్‌ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. కాగా.. లోన్‌ తీసుకునే సమయంలో ఫ్రెండ్స్‌ ఫోన్‌ నంబర్స్‌ను రాజ్‌కుమార్‌ రిఫరెన్స్‌ కాంటాక్ట్స్‌గా ఇచ్చాడు. దీంతో అతని స్నేహితులకు, కుటుంబసభ్యులకు కూడా కాల్స్‌, మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్స్‌ పెట్టారు. వారికి వరుస కాల్స్, మెసేజ్‌లు రావడంతో చెల్లించాలని రాజ్ కుమార్ ను పలుమార్లు సూచించారు. దీంతో రాజ్ కుమార్ తీవ్ర మనస్తాపం చెందాడు. చివరకు లోన్ యాప్ నిర్వహకుల వేధింపులు తాళలేక.. రాజ్‌కుమార్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్‌కుమార్‌ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. లోన్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రాజ్ కుమార్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

కాగా.. లోన్‌యాప్‌లో రుణాలు తీసుకొని చెల్లించకపోవడంతో యాప్‌ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో చాలామంది తీవ్ర మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

Hyderabad: రమ్మంటూ వేధిస్తున్నాడు.. ఓ పార్టీ నాయకుడిపై మహిళ సంచలన ఆరోపణలు..

SBI: బ్యాంకులో దొంగలు పడ్డారు.. ఏస్‌బీఐ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల నాణేలు మాయం.. రంగంలోకి సీబీఐ