Hyderabad: మెహిదీపట్నం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. ఆ తర్వాత జరిగిందిదే! వీడియో వైరల్

మెహిదీపట్నంలో మంగళవారం (ఆగస్ట్ 26) ఘోర ప్రమాదం తప్పింది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు మెహదీపట్నం బస్టాండ్‌ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, బస్సులోని ప్రయాణికులు అందర్నీ..

Hyderabad: మెహిదీపట్నం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. ఆ తర్వాత జరిగిందిదే! వీడియో వైరల్
TGSRTC Bus fire incident at Mehdipatnam

Updated on: Aug 27, 2025 | 6:59 AM

హైదరాబాద్, ఆగస్ట్‌ 27: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌ మహానగరంలోని మెహిదీపట్నంలో మంగళవారం (ఆగస్ట్ 26) ఘోర ప్రమాదం తప్పింది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు మెహదీపట్నం బస్టాండ్‌ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, బస్సులోని ప్రయాణికులు అందర్నీ హుటాహుటీన కిందకు దించేశాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్‌ అప్రమత్తత వల్ల ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

మెహిదీపట్నం డిపోనకు చెందిన ఆర్టీసీ సిటీ బస్సు.. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మాసబ్‌ ట్యాంక్‌ నుంచి రాజేంద్ర నగర్ వైపు వెళ్తుంది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే మెహదీపట్నంలోని మెట్రో పిల్లర్ నెం.9 బస్టాండ్‌ సమీపంలోకి చేరుకోగానే బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దింపేశాడు.

ఇవి కూడా చదవండి

బస్సు సిబ్బంది అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే మంటల ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న మెహిదీపట్నం డిపో మేనేజర్‌, మెకానిక్‌ విభాగం ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.