Hyderabad: ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా

Hyderabad: ఇంటర్నేషనల్ హబ్‌గా హైదరాబాద్‌. ఇండియన్‌ సిన్మా ఇండస్ట్రీ క్యాపిటల్‌గా హైదరాబాద్‌. ప్రభుత్వంతో టాలీవుడ్‌ పెద్దల భేటీలో ఇదే మెయిన్‌ పాయింట్‌. వివాదాలకు తావులేకుండా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఓటీటీలకు హైదరాబాద్‌ని కేరాఫ్‌గా మార్చాలని సంకల్పించారు..

Hyderabad: ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా

Updated on: Dec 26, 2024 | 10:01 PM

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా. నెట్ ప్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ సంస్థలు కూడా ఇక్కడే స్థిరపడేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. వివాదాలు పక్కన పెట్టి పరిశ్రమ అభివృద్దితో పాటు, రాష్ట్రాభివృద్దిలో భాగం కావాలని రెండు పక్షాలూ నిర్ణయం. నిన్నటిదాకా అపోహలు. అనుమానాలు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనతో.. బెనిఫిట్‌ షోలు, టికెట్ల రేట్లపెంపుపై సీరియస్‌ నిర్ణయాలు. టాలీవుడ్‌ ఫ్యూచర్‌పై రకరకాల ప్రచారాలు. కానీ ఒక్క మీటింగ్‌తో అన్నీ పటాపంచలైపోయాయి. ఆ ఒక్కటీ తప్ప ఏదన్నా ఓకే అనేసింది సర్కారు. అదేమంత సమస్యేకాదు.. ఇక ఇండస్ట్రీ అసలు టార్గెట్‌ అదేనంటున్నారు పరిశ్రమ పెద్దలు. సర్కారు, సిన్మా ఇండస్ట్రీ నోట ఇప్పుడు ఒకటే మాట. ఇండియన్‌ ఫిల్మ్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్‌ అని టాలీవుడ్‌ ఎప్పుడో ప్రూవ్‌ చేసుకుంది. పాన్‌ ఇండియా సిన్మాలతో తన సత్తాచాటింది. టేకింగ్‌ నుంచి కలెక్షన్స్‌దాకా తనకెంత స్టామినా ఉందో ప్రపంచానికి చూపింది. ఆస్కార్‌ విశ్వ వేదికపై కూడా తెలుగు సినీ పరిశ్రమ గొప్పతనాన్ని సగర్వంగా చాటింది. ఇప్పుడు ఫిల్మ్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ని నిలబెట్టాలనే సంకల్పాన్ని తీసుకుంది. థియేటర్‌లో తొక్కిసలాటపై కేసులు, అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో వాతావరణం హీటెక్కిన టైంలో.. దిల్‌రాజు చొరవతో హైదరాబాద్ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. పుష్పరాజ్‌ కేసుపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో సీఎంని కలుసుకున్నారు ఇండస్ట్రీ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి