ఆ 2 కోట్ల డబ్బు ‘జయభేరి’ సంస్థదే: సీపీ సజ్జనార్

| Edited By:

Apr 04, 2019 | 4:47 PM

బుధవారం హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులకు పట్టుబడ్డ 2 కోట్ల నగదు జయభేరీ సంస్థకు చెందినదే అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. రెండు బ్యాగుల్లో మొత్తం 2 కోట్ల రూపాయల్ని రాజమండ్రికి తరలిస్తుండగా.. మాదాపూర్ ఎస్‌వోటీ టీం అదుపులోకి తీసుకుందని సీపీ తెలిపారు. నిమ్మలూరి శ్రీహరి, ఆవుటి పండరీ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. ఈ డబ్బును రాజమండ్రికి తీసుకెళ్లి […]

ఆ 2 కోట్ల డబ్బు ‘జయభేరి’ సంస్థదే: సీపీ సజ్జనార్
Follow us on

బుధవారం హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులకు పట్టుబడ్డ 2 కోట్ల నగదు జయభేరీ సంస్థకు చెందినదే అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. రెండు బ్యాగుల్లో మొత్తం 2 కోట్ల రూపాయల్ని రాజమండ్రికి తరలిస్తుండగా.. మాదాపూర్ ఎస్‌వోటీ టీం అదుపులోకి తీసుకుందని సీపీ తెలిపారు. నిమ్మలూరి శ్రీహరి, ఆవుటి పండరీ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. ఈ డబ్బును రాజమండ్రికి తీసుకెళ్లి యలమంచిలి కృష్ణ, ఎంపీ మురళీ మోహన్‌కు అప్పగించేందుకు శ్రీహరి, పండరి వెళ్తున్నారని సీపీ స్పష్టం చేశారు. ఇక ఈ కేసులో సెక్షన్ 171 బీ, సీ, ఈ, ఎఫ్ కింద మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేశామని సజ్జనార్ వెల్లడించారు.