V. Hanumantha Rao: వీహెచ్‌ ఇంటిపై రాళ్ల దాడి.. కారును ధ్వంసం చేసిన దుండగులు..

|

Apr 14, 2022 | 10:13 AM

V. Hanumantha Rao House: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

V. Hanumantha Rao: వీహెచ్‌ ఇంటిపై రాళ్ల దాడి.. కారును ధ్వంసం చేసిన దుండగులు..
V. Hanumantha Rao
Follow us on

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(V. Hanumantha Rao) ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. రాత్రి హైదరాబాద్‌లోని డీడీ కాలనీలోని ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేసిన దుండగులు.. ఇంటి ముందు పార్క్‌ చేసిన కారును అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దాడి వివరాలను వీహెచ్‌ తెలిపారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానన్నారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తనకు రక్షణ లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేదా అని నిలదీశారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి విన్నవించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగారు అంబర్పేట్ పోలీసులు. దాడి జరిగిన తీరును వారు పరిశీలించారు. దాడి చేసింది ఎవరు అనే అనే కోణంలో పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హల్‌చల్ చేసే వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిందన్న సమాచరంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో వీహెచ్చ ఇంటి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

మాజీ ఎంపీ వి. హనుమంతరావు రావు ఇంటి పైన దుండగుల దాడి ని తీవ్రంగా ఖండించింది టీపీసీసీ. హనుమంతరావుతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు ఇంటిపై దుండగులు అర్ధరాత్రి దాడి చేసి రాళ్లు వేయడంతో ఇంటి అద్దాలు.. కారు ద్వంసం చేసిన దోషులను పోలీసులు వెంటనే గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలి.. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..

JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!