Indian Railway: సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకటించిన రైల్వేశాఖ.. టైమింగ్స్ ఇవే..

సంక్రాంతికి లక్షల మందికి జనం హైదరాబాద్ నుంచి తమ సొంతూర్లకు వెళ్తుంటారు. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుండటంతో రైళ్లల్లో రద్దీ మరింత పెరిగింది. దీనికి తగ్గట్లు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. సంక్రాంతికి తిరగబోయే ప్రత్యేక రైళ్ల వివరాలను రైల్వేశాఖ ప్రకటించింది.

Indian Railway: సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకటించిన రైల్వేశాఖ.. టైమింగ్స్ ఇవే..
Special Trains

Updated on: Dec 23, 2025 | 8:39 AM

సంక్రాంతికి పండక్కి ఇంటికెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ అందిందది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రతీ ఏడాది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ సారి కూడా పండగకు సొంతూరు వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వీటిని నడపనుంది. పండుగ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నుంచి లక్షల మంది జనం సొంతూళ్ల ప్రయాణమవుతారు. వీరి రద్దీతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. రైళ్లల్లో ఖాళీ దొరక్క ఇతర మార్గాల్లో చాలామంది వెళుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

వచ్చే నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. సికింద్రాబాద్-శ్రీకాకుళం (07288) ప్రత్యేక రైలు 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. సాయంత్రం 19.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళంకు చేరుకోనుంది. ఇక ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 15.30కు శ్రీకాకుళంలో బయల్దేరి తర్వాతి రోజు 8.10 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది. ఇక మరో రైలు సికింద్రాబాద్-శ్రీకాకుళం(07290) టైమింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అలాగే వికారాబాద్-శ్రీకాకుళం(07294) సాయంత్రం 17.15 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 15.30 గంటలకు శ్రీకాకుళం నుంచి బయల్దేరి తర్వాతి రోజు 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఇక సికింద్రాబాద్-శ్రీకాకుళం(07292) వచ్చే నెల 17వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఇది 19.00 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 12.30 గంటలకు శ్రీకాకుళంకు చేరుకుంటుది. తిరుగ ప్రయాణంలో శ్రీకాకుళంలో 15.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 08.10 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది.