Kishan Reddy: హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మట్‌ ఘనంగా ప్రారంభమైంది.. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించి కీలక ఉపన్యాసం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని అన్నారు. అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు.

Kishan Reddy: హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy

Updated on: Dec 08, 2025 | 5:03 PM

రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మట్‌ ఘనంగా ప్రారంభమైంది.. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించి కీలక ఉపన్యాసం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని అన్నారు. అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యమన్నారు గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ.. గవర్నర్ ప్రంసంగం అనంతరం నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. యువ సీఎం రేవంత్‌ అద్భుతాలు చేశారని.. నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు.. విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నారన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలలో రాష్ట్రాల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సాయం అందిస్తామన్నారు. హైదరాబాద్ ఒక నగరం కాదు..అనేక రంగాలకు హబ్.. దేశ ఆర్థిక రంగానికి హైదరాబాద్ పిల్లర్ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలన్నారు. వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలు భాగం కావాలన్నారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీఉండాలని.. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం..సురక్షితమైన దేశం అని పేర్కొన్నారు. గత పదేళ్లలో దేశం అనేక రంగాల్లో ప్రగతి సాధించిందన్నారు.  తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు.  వికసిత్‌ భారత్ 2047లో తెలంగాణది కీలకపాత్ర అని వివరించారు.