
Sunrisers Hyderabad vs Chennai Super Kings, 18th Match: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మద్య కీలక మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌కు సెలబ్రెటీల తాకిడి పెరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. విక్టరీ వెంకటేష్‌తో కలిసి మ్యాచ్‌ను చూసి ఎంజాబ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలు సందడి చేస్తున్నాయి. కాగా, సీఎం రేవంత్‌ను చూసిన ప్రేక్షకులు సీఎం, సీఎం అంటూ అరుపులు మొదలుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూసేందుక వచ్చారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా స్టేడియంలో కనిపించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 (ఐపీఎల్) 18వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య హైదరాబాద్‌లో జరుగుతోంది. శుక్రవారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేస్తోన్న చెన్నై వార్తలు రాసే సమయానికి 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే, శివమ్ దూబే ఉన్నారు. వీరిద్దరి మధ్య యాభై భాగస్వామ్యం కొనసాగుతోంది.
26 పరుగుల వద్ద రితురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. అతను షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్ అద్భుత క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు రచిన్ రవీంద్ర (12 పరుగులు) భువనేశ్వర్ కుమార్‌కు బలయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..