Telangana Assembly: ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ రగడ తీవ్రస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నేతల నల్లచొక్కాల నిరసన, ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు, స్పీకర్ గౌరవంపై వివాదం, కాంగ్రెస్-బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు 22ఏ భూముల అంశంపై చర్చకు బీజేపీ పట్టుబడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళనకు దిగిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

Telangana Assembly: ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
Telangana Assembly Session

Updated on: Sep 07, 2026 | 9:50 PM

చట్టసభ ఏదైనా సమావేశమయ్యే ముందు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ-బీఏసీ మీట్ కంపల్సరీ. అన్ని పక్షాల లీడర్లూ కూర్చుని మాట్లాడి అజెండా ఫిక్స్ చేస్తారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి తాజా సమావేశాలకు సంబంధించి కూడా BAC మీటింగ్ జరిగింది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై ఎంతెంత సమయం మాట్లాడాలి? అని క్లియర్‌కట్‌గా పేపర్‌పై రాసుకున్నారు. కానీ, ఇది జస్ట్ డ్రాఫ్ట్ మాత్రమే. సభ మొదలయ్యాక రియాలిటీ వేరేగా ఉంటుంది. అక్కడ జరగాల్సిన చర్చ కంటే, జరక్కూడని రచ్చే ఎక్కువౌతుంది. మనం ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు చూడ్లేదూ! కానీ, ట్విస్ట్ ఏంటంటే, రొటీన్ ట్రెండ్‌ కూడా ఈసారి బ్రేకైంది. ఐదురోజుల సమావేశంలో మాటల కంటే తంటాలే ఎక్కువని తేలిపోయింది. ఆ రేంజ్‌లో జరిగింది తొలిరోజు రగడ. తొలిరోజే బ్లాక్‌ మండే… దద్దరిల్లిన అసెంబ్లీ ఔట్‌సైడ్ బ్లాక్ టీషర్ట్ వేసుకుని, సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించి, అడ్డుకున్న పోలీసుల్ని ప్రతిఘటించబోయి అసెంబ్లీ గేటు బైట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన కామెంట్లు.. సహజంగానే సెంటరాఫ్ కాంట్రవర్సీ అయ్యాయి. తాతా మధు ఫ్రస్ట్రేషన్‌తో అన్న ఆ నాలుగు మాటలు సభాపతిని సూటిగానే తాకేశాయ్. సభామర్యాద అనే సబ్జెక్ట్ మళ్లీ చర్చకొచ్చింది, రచ్చ లేపుతోంది. వీధుల్లో తాతామధు దిష్టిబొమ్మలు కూడా దగ్ధమౌతున్నాయ్. స్పీకర్‌ను స్పెషల్‌గా...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి