రాత్రివేళ కుక్కలు ఎందుకు అరుస్తాయి? అసలు కారణం ఇదేనా..?

September 7, 2026

Subhash

అర్ధరాత్రి సమయంలో కుక్కలు అరుస్తూ ఉండటం చాలామంది గమనించే ఉంటారు. అసలు అవి ఎందుకు అలా అరుస్తాయో తెలుసా?

అర్ధరాత్రి సమయంలో

కుక్కలు రాత్రివేళ అరుస్తే దెయ్యాలు లేదా ఆత్మలను చూస్తున్నాయని కొందరు నమ్ముతారు. అలాగే ఏదైనా అశుభం జరగబోతోందని భావిస్తారు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

దెయ్యాలు కనిపిస్తాయా?

కుక్కలకు అరవడం ఒక రకమైన కమ్యూనికేషన్. దూరంగా ఉన్న ఇతర కుక్కలకు తమ ఉనికిని తెలియజేయడానికి అవి హౌల్ చేస్తాయి.

ఇతర కుక్కలకు సంకేతం

కుక్కలు ఎక్కువసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆందోళనకు గురై అరవవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రాత్రివేళ నిశ్శబ్దంగా ఉండటంతో ఈ ప్రవర్తన మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఒంటరితనం కూడా కారణమే

కుక్క అకస్మాత్తుగా ఎక్కువగా అరవడం మొదలుపెడితే దానికి నొప్పి, గాయం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు.

అనారోగ్యం లేదా నొప్పి

అంబులెన్స్ లేదా ఇతర సైరన్లు, పెద్ద శబ్దాలు, మరో కుక్క అరుపు వంటివి విన్నప్పుడు కూడా కుక్కలు వాటికి ప్రతిస్పందనగా హౌల్ చేయవచ్చు.

సైరన్లు, ఇతర శబ్దాలకు స్పందన

తమ పరిధిలోకి ఇతర కుక్కలు లేదా అపరిచితులు వచ్చినట్లు అనిపించినప్పుడు కుక్కలు అరుస్తూ హెచ్చరిక ఇవ్వవచ్చు. ఇది వాటి సహజ ప్రవర్తనలో భాగం.

తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు

కుక్క అరుపును వెంటనే అశుభానికి సంకేతంగా భావించాల్సిన అవసరం లేదు. సాధారణంగా అది కమ్యూనికేషన్, ఒంటరితనం, పరిసర శబ్దాలు లేదా అసౌకర్యాన్ని వ్యక్తం చేసే విధానం.

భయపడాల్సిన అవసరం లేదు