భార్య ఫోన్ మాట్లాడుతుండగా ఎంట్రీ ఇచ్చిన భర్త.. ఆ తర్వాత అర్థరాత్రి ఏం జరిగిందంటే..?

అనుమానం మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. అలానే.. అనుమానం.. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. పదేళ్ల క్రితం పెళ్లై, ఇద్దరు పిల్లలతో కళకళలాడుతున్న ఆ సంసారంలో విషాదాన్ని నింపింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో గొంతు నులిమి చంపిన ఓ కిరాతకుడికి చేవెళ్ల న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది.

భార్య ఫోన్ మాట్లాడుతుండగా ఎంట్రీ ఇచ్చిన భర్త.. ఆ తర్వాత అర్థరాత్రి ఏం జరిగిందంటే..?
Crime News

Edited By:

Updated on: Mar 10, 2026 | 5:46 PM

అనుమానం మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. అలానే.. అనుమానం.. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. పదేళ్ల క్రితం పెళ్లై, ఇద్దరు పిల్లలతో కళకళలాడుతున్న ఆ సంసారంలో విషాదాన్ని నింపింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో గొంతు నులిమి చంపిన ఓ కిరాతకుడికి చేవెళ్ల న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. మూడేళ్ల క్రితం షాబాద్‌లో జరిగిన ఈ దారుణ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

వివరాల ప్రకారం.. షాబాద్‌కు చెందిన వడ్డే రమేష్, తన భార్య అనిత ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. జూలై 12, 2021 రాత్రి.. అనిత ఫోన్‌లో మాట్లాడుతుండటం చూసిన రమేష్, ఆవేశంతో ఊగిపోయాడు. గొడవ పెరిగి చివరకు ఆమె గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు.. అయితే హత్య చేసిన తర్వాత రమేష్ ఏమీ తెలియనట్టు నాటకమాడాడు. తన అత్తగారికి ఫోన్ చేసి ‘మీ అమ్మాయి చనిపోయింది.. మేం పడుకున్నాం, ఏం జరిగిందో తెలియదు’ అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షాబాద్ పోలీసులు అసలు నిజాన్ని వెలికితీశారు.

అప్పటి ఇన్‌స్పెక్టర్ డి. అశోక్ నేతృత్వంలో పోలీసులు పక్కా ఆధారాలను సేకరించి చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసును సుదీర్ఘంగా విచారించిన చేవెళ్లలోని XVIII అదనపు కోర్టు, నిందితుడు రమేష్‌పై మోపబడిన BNS సెక్షన్ 103 కింద నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదుతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు చేసిన కృషిని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఉన్నతాధికారులు అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us