ఉదయం నుంచి మండుటెండతో ఇబ్బంది పడ్డ హైదరాబాద్ నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఉరుములు-మెరుపులతో కూడాన భారీ వర్షం(Heavy Rain) కురిసింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యియి. సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, సీతాఫల్‌మండి, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, కుషాయిగూడ, చెంగిచెర్ల, ఉప్పల్, రాంనగర్, ముషిరాబాద్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్ట, లక్డీకాపూల్, చంపాపేట, సైదాబాద్, చైతన్యపురి, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం అంబర్‌పేట్, కాచీగూడ, నల్లకుంట, నాంపల్లి, నాగోల్, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానపడింది. దీంతో పలుచోట్ల రోడ్లపైకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రాంతాలతో పాటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్‌లో చిరుజల్లులు కురిశాయి. వాహనదారులు కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
వెదర్ అలర్ట్..
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఇవాళ ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల వద్ద కొనసాగుతోంది. వాతావరణ శాఖ ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా చల్లని ప్రకటన చేసింది. ఉత్తర తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపాయి.
విదర్భ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి సోమవారం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని కారణంగా వాయుగుండం మరింత బలపడే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పుదుచ్చేరి, కరైకాల్, కర్ణాటక ఈదురు గాలులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి: AP: ఫీజు కట్టాలంటూ అందరి ముందు అవమానించారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారులు..