ఓయూలో విద్యార్థినుల ధర్నా!

| Edited By:

Aug 16, 2019 | 4:53 PM

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో కలకలం రేగింది. గురువారం తెల్లవారుజామున ఇంజనీరింగ్ కాలేజీ అనుబంధ లేడీస్ హాస్టల్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడటం దుమారం రేపింది. ఇంజినీరింగ్‌ విద్యార్థినుల హాస్టల్‌లో ఆగంతుకుడు హల్‌చల్‌ చేశాడు. హాస్టల్‌లోకి దూరి కత్తితో ఓ విద్యార్థినిని బెదిరించాడు. మిగతా విద్యార్థినులు గట్టిగా అరవడంతో మొదటి అంతస్తు నుంచి దూకి పరారయ్యాడు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఇవాళ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. […]

ఓయూలో విద్యార్థినుల ధర్నా!
Follow us on

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో కలకలం రేగింది. గురువారం తెల్లవారుజామున ఇంజనీరింగ్ కాలేజీ అనుబంధ లేడీస్ హాస్టల్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడటం దుమారం రేపింది. ఇంజినీరింగ్‌ విద్యార్థినుల హాస్టల్‌లో ఆగంతుకుడు హల్‌చల్‌ చేశాడు. హాస్టల్‌లోకి దూరి కత్తితో ఓ విద్యార్థినిని బెదిరించాడు. మిగతా విద్యార్థినులు గట్టిగా అరవడంతో మొదటి అంతస్తు నుంచి దూకి పరారయ్యాడు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఇవాళ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. తాజా ఘటనపై విశ్వవిద్యాలయ అధికారులు స్పందించారు. వసతి గృహం ప్రహరీగోడ ఎత్తు పెంచుతామని, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, రాత్రివేళల్లో మహిళా గార్డులను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. అవసరమైన చోట ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేస్తామని, దీని కోసం ఇప్పటికే సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశామని అధికారులు మీడియాకు వివరించారు.