గ్రేటర్‌లోని మ్యాన్ హోల్స్‌పై జలమండలి స్పెషల్ ఆపరేషన్.. ఇక సమస్య తీరినట్టే.!

|

Jul 31, 2024 | 9:05 PM

గ్రేటర్‌లోని మ్యాన్ హోల్స్‌పై జలమండలి విభాగం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మ్యాన్‌హోల్స్‌ మానవ మృత్యుకుహరాలు కాకుండా చర్యలు చేపట్టింది. ఓ వైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే.. మరో వైపు రక్షణ చర్యలు చేపట్టారు.

గ్రేటర్‌లోని మ్యాన్ హోల్స్‌పై జలమండలి స్పెషల్ ఆపరేషన్.. ఇక సమస్య తీరినట్టే.!
Ghmc
Follow us on

గ్రేటర్‌లోని మ్యాన్ హోల్స్‌పై జలమండలి విభాగం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మ్యాన్‌హోల్స్‌ మానవ మృత్యుకుహరాలు కాకుండా చర్యలు చేపట్టింది. ఓ వైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే.. మరో వైపు రక్షణ చర్యలు చేపట్టారు. ‘ఇక్కడ మ్యాన్‌హోల్‌ ఉంది.. జాగ్రత్త!’ అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది. మరి ఈ సేఫ్టీ గ్రిల్స్‌ ఎంతవరకు సేఫ్‌.

హైదరాబాద్ మహానగరంలో వర్షం వస్తే ఆనందం మాటేమో దేవుడేరుగు గాని.. ట్రాఫిక్‌లో వెళ్లాలంటేనే జనం భయంతో వణుకుతారు. గతంలో జరిగిన అనుభవాలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరచి ఉంటుందో తెలియని పరిస్థితి. అందుకే చినుకు పడితే చాలు భాగ్యనగర వాసుల్లో వణుకు పుడుతోంది. చెరువులను తలపించే రోడ్ల మీద మ్యాన్ హోల్స్​ను తప్పించుకుని బయటపడటానికి నగర జీవులు సాహసం చేస్తుంటారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సిటీలో రోడ్లపై తెరుచి ఉన్న మ్యాన్ హోళ్లకు మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి.

హైదరాబాద్ మహానగరంలో మొత్తం 5,82,500 డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ఉన్నాయి. దాదాపు 10,057 కిలోమీటర్లు పొడవు విస్తరించి ఉన్న డ్రైనేజీ వ్యవస్థలో ప్రమాదకరమైన డీప్ మ్యాన్ హోల్స్ 19, 545 ఉన్నాయి. అయితే ప్రమాదకరమైన డీప్ మ్యాన్ హోల్స్‌ పైభాగంలో మూత తీసిన తర్వాత సెకండ్ లేయర్లో సేఫ్ గ్రిల్స్‌ను అమరుస్తున్నారు. మ్యాన్ హోల్ చుట్టూ మాన్యువల్ పైన రెడ్ పెయింటువేసి నగర వాసులకు అప్రమత్తం చేస్తున్నారు. మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి ఉంచినప్పటికీ లోపల అమర్చిన సేఫ్ గ్రిల్స్ ద్వారా వరద నీరు లోపలికి వెళ్ళిపోవడమే కాకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

వర్షాకాలంలో ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్​ను శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఈ సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటుపై సిటీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చినుకు పడితే ప్రాణాలు మింగేసే మ్యాన్‌ హోల్స్‌ కు సేఫ్ట్‌ గ్రీల్స్‌ ఏర్పాటు చేయడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.