Secunderabad Railways: వచ్చే వారం రోజులపాటు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే

ఒడిశాలో రైలు ప్రమాద ఘటన దృష్ట్యా జూన్‌ 7 నుంచి 13 వరకు పలు రైళ్లను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరే పలు రైళ్లు రద్దయినట్లు తెల్పింది. మరోవైపు వేసవి సెలవులు ముగుస్తుండటంతో..

Secunderabad Railways: వచ్చే వారం రోజులపాటు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే
Secendrabad Railways

Updated on: Jun 07, 2023 | 9:47 AM

హైదరాబాద్‌: ఒడిశాలో రైలు ప్రమాద ఘటన దృష్ట్యా జూన్‌ 7 నుంచి 13 వరకు పలు రైళ్లను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరే పలు రైళ్లు రద్దయినట్లు తెల్పింది. మరోవైపు వేసవి సెలవులు ముగుస్తుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రాకపోకలు ఊపందుకున్నాయి. ఇలాంటి సమయంలో రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. ఐతే కాచిగూడ–తిరుపతి (070 61 / 07062), కాచిగూడ–కాకినాడ (07417 / 07418), కాచిగూడ–నర్సాపూర్‌ (07653 / 07654) ప్రత్యేక రైళ్లను మాత్రం జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు సీపీఆర్వో తెలిపారు. ఏయే రైళ్లు, ఏయే తేదీల్లో నిలిచిపోనున్నాయంటే..

జూన్‌ 7 నుంచి 13 వరకు రద్దయ్యే ట్రైన్లు ఇవే..

  • కాచిగూడ–నిజామాబాద్‌ (07596)
  • నిజామాబాద్‌–కాచిగూడ (07593)
  • నాందేడ్‌–నిజామాబాద్‌ (07854)
  • నిజామాబాద్‌–నాదేడ్‌ (07853)

జూన్‌ 7న రద్దయ్యే ట్రైన్లు

  • కాచిగూడ–షాలిమార్‌–వాస్కోడిగామా (17603/18047)
  • షాలిమార్‌–హైదరాబాద్‌ (18045/18046)

వాస్కోడిగామా–షాలిమార్‌–కాచిగూడ (18048/17604) రైలు జూన్ 9న రద్దు కానుంది. అలాగే దౌండ్‌–నిజామాబాద్‌ (11409), నిజామాబాద్‌–పంఢర్‌పూర్‌ (01413) రైళ్లు పాక్షికంగా రద్దుకానున్నట్లు ఇండియన్ రైల్వే తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us