MMTS Hyderabad: హైదరాబాద్ వాసులను దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ చేసింది. ఆదివారం (ఆగస్టు 7) నగరంలో పలు రూట్లలో తిరిగే ఎంఎంటీఎస్ సర్వీసులను రద్ద చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలో మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఆపరేషన్ సంబంధిత సమస్యల కారణంగా సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వీసులను రద్దు చేస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులను అలర్ట్ చేశారు.
ఆదివారం ఎంఎంటీఎస్ ట్రైన్స్‌లో ప్రయాణించాలనుకునే వారు ప్రత్యామ్నాయం మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు.
అధికారులు రద్దు చేసిన రూట్లలో లింగంపల్లి-హైదరాబాద్, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. ఏయే రూట్లలో రైళ్లు రద్దయ్యాయి, ట్రైన్ నెంబర్ల పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* లింగంపల్లి – హైదరాబాద్ (9 సర్వీసులు) – 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140
* హైదరాబాద్ – లింగంపల్లి (9 సర్వీసులు) – 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
* లింగంపల్లి – ఫలక్‌నుమా (7 సర్వీసులు) – 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
* ఫలక్‌నుమా – లింగంపల్లి (7 సర్వీసులు) – 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
* లింగంపల్లి – సికింద్రాబాద్ (1 సర్వీసు) – 47195
* సికింద్రాబాద్ – లింగంపల్లి (1 సర్వీసు) – 47150
Cancellation of 34 MMTS train services @drmsecunderabad pic.twitter.com/EKNpCp9b3X
— South Central Railway (@SCRailwayIndia) August 5, 2022
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..