Hyderabad: ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు – రెప్పపాటులో నుజ్జునుజ్జుయిన బిడ్డని చూసి ముక్కలయిన హృదయం

స్కూల్‌కి లేటవుతోందనే తొందరో.. లేదంటే పక్కన వెళ్తున్న వాహనాల వేగాన్ని అంచనా వేయడంలో పొరపాటో..! కారణం ఏదైతేనేం పసివాడి ప్రాణం టిప్పర్‌ టైర్‌ కింద నలిగిపోయింది. హైదరాబాద్‌ మల్లంపేటలో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు కన్నీరుపెట్టిస్తున్నాయ్‌..! ఉదయాన్నే బాబును స్కూల్‌లో డ్రాప్ చేసేందుకు తల్లి తీసుకువెళ్తుండగా.. టూవీలర్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Hyderabad: ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు - రెప్పపాటులో నుజ్జునుజ్జుయిన బిడ్డని చూసి ముక్కలయిన హృదయం
Road Accident

Updated on: Jun 27, 2025 | 12:13 PM

రెప్పపాటులో టిప్పర్‌కి  పిల్లాడి ప్రాణం బలైపోయింది. టిప్పర్‌ను ఓవర్‌టెక్‌ చేయబోయి టూవీలర్‌ అదుపుతప్పింది. టిప్పర్‌ అంచుకి టూవీలర్‌ తాకడంతో తల్లీకొడుకులు కిందపడిపోయారు.  టైర్‌ కింద పడిపోయిన బాలుడు అభిమన్షు రెడ్డి స్పాట్‌లోనే మృతి  చెందాడు.

యాక్సిడెంట్ ఎలా జరిగిందో.. ఏం జరిగిందో ఆ తల్లికి కూడా అర్థం కాలేదు. కిందపడిన పిల్లాడిని ఒళ్లోకి తీసుకుబోయి షాకైపోయింది. టిప్పర్‌ టైర్‌ ఆ పిల్లాడి తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయిపోయింది. ఈ దృశ్యాలు బ్లర్‌ లేకుండా చూస్తే తట్టుకోలేనంత కలవరపాటుకు గురి చేసేలా ఉన్నాయి. బాలుడిని ఎత్తుకున్న తల్లి క్షణం పాటు పొత్తిళ్లలో పొదివి పట్టుకుంది.. కానీ నిర్జీవంగా వేళ్లాడిపోతున్న పిల్లాడిని చూసి తట్టుకోలేక గుండెలు పగిలేలా కన్నీరు పెట్టింది. కాసేపటికి స్పాట్‌కి చేరుకున్న తండ్రి వేదన కూడా వర్ణనాతీతం.. కొడుకుని కోల్పోయిన షాక్‌ నుంచి ఇంకా వాళ్లు తేరుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌ మల్లంపేట్‌ దగ్గర్లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక స్కూల్‌లో బాబు అభిమాన్షు ఒకటో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

అరసెకను‌ ఆగి ఉంటే ప్రాణం నిలబడేది.. ఊహించని ప్రమాదం జరిగినప్పుడు మనం చాలాసార్లు ఇలా అనుకునే ఉంటాం.. ఇది కూడా అలాంటి ఘటనే.. రెప్పపాటులో జరిగిన ఘోరానికి పిల్లాడు బలైపోయాడు. మరికొద్ది నిమిషాలైతే స్కూల్‌కి వెళ్లిపోయేవాడు.. ఫ్రెండ్స్‌కి హాయ్ చెప్పేవాడు.. అసెంబ్లీలో ప్లేయర్‌ చేసేవాడు.. టీచర్‌ చెప్పే పాఠాలు వినేవాడు. కానీ.. ఈలోపే ఊహించని విధంగా ముంచుకొచ్చిన మృత్యువు పిల్లాడిని మింగేసింది.

స్కూల్‌కి లేటవుతుందనే తొందరో, లేదంటే పక్కన ఉన్న వాహనాల స్పీడ్‌ని అంచనా వేయడంలో పొరపాటో కానీ.. యాక్సిడెంట్‌లో టూవీలర్‌ స్కిడ్‌ అవడం.. చిన్న బాబు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోవడం అందరి హృదాయల్నీ కలచివేస్తోంది.

యాక్సిడెంట్ దృశ్యాలు దిగువన ఇస్తున్నాం – అవి మిమ్మల్ని కలవరపరచవచ్చు – సున్నిత మనష్కులు చూడకండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..