Road Accident: హైదరాబాద్‌లో వరుస ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నిన్న జరిగిన కర్మాన్‌ఘాట్, బంజారాహిల్స్ ప్రమాదాలను మరిచిపోకముందే.. మరో ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర ఓ టూ వీలర్ నడిపే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. అతివేగమే దీనికి ప్రమాద కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్పీడ్‌గా వెళ్తున్న సమయంలో కుక్క అడ్డు రాగా.. డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీంతో స్కిడ్ అయి పడిపోవడంతో అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.