Hyderabad: భారీగా పెరుగుతోన్న కుక్కల దాడులు.. ఒక్క డిసెంబర్‌ నెలలోనే ఏకంగా..

గడిచిన కేవలం నెల రోజుల్లోనే హైదరాబాద్‌లో ఏకంగా 2000కి పైగా కుక్క దాడి కేసులు నమోదయాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌కే మాత్రమే పరిమితం కాకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కుక్క కాటుకు సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని..

Hyderabad: భారీగా పెరుగుతోన్న కుక్కల దాడులు.. ఒక్క డిసెంబర్‌ నెలలోనే ఏకంగా..
Dog Bites

Edited By:

Updated on: Jan 04, 2024 | 12:45 PM

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కుక్క కట్టు కేసులు బాగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో చిన్న అబ్బాయి చనిపోయిన సంఘటన అందరినీ కలచివేసిన విషయం తెలిసిందే. ఇక క్రమంలో వచ్చే వేసవలో కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని పశు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో పెరుగుతోన్న కుక్క దాడి కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

గడిచిన కేవలం నెల రోజుల్లోనే హైదరాబాద్‌లో ఏకంగా 2000కి పైగా కుక్క దాడి కేసులు నమోదయాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌కే మాత్రమే పరిమితం కాకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కుక్క కాటుకు సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుక్క కాటు కేసులో మొదటగా ట్రీట్మెంట్ ఇచ్చే ఫీవర్ హాస్పిటల్ లో డిసెంబర్ ఒక్క నెలలోనే 2500 పైగాకేసులు నమోదయ్యాయి అని వైద్యులు అంటున్నారు.

సగటున దాదాపుగా రోజు 100 కేసులు వరకు నమోదవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.అయితే కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకితే మరణం తప్పదు అని డాగ్ బైట్ కి చికిత్స అవసరం అని అంటున్నారు ఎందుకు అంటే రేబిస్ కి చికిత్స లేదు.కానీ ఈ మధ్య ఫీవర్ ఆస్పత్రిలోనే వారానికి రెండు ముడు రేబిస్ కేసులు నమోదు అవుతున్నాయి అని బాంబ్ పేల్చారు వైద్యులు.

జరుగుతున్న డాగ్ బైట్ కేసుల్లో వీధి కుక్కల వల్లే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. జంట నగరాల్లో రేబిస్ వార్డ్ కేవలం ఫీవర్ ఆస్పత్రిలో ఉంది. ఇక్కడ ఎప్పటికీ రేబిస్ పేషంట్స్ అడ్మిషన్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి కుక్క కరిచిన వెంటనే చికిత్స తీసుకోవాలని రేబిస్‌ లక్షణాలు కనిపిస్తే ఫీవర్ ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నారు వైద్యులు. గడిచిన డిసెంబర్‌లో నమోదైన 2 వేలకిపైగా కుక్క కాటు కేసుల్లో 500కి పైగా చిన్నారులకు గాయాలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us