e-Challan: మీక్కూడా ఈ-చలాన్ల పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? క్లిక్ చేస్తున్నారా.?

ఇదిలా ఉంటే ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఈ చలాన్లను కూడా వదలడం లేదు. నకిలీ ఈ చలాన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాపిక్‌ పోలీసుల రూపంలో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. నకిలీ ఈ చలాన్ల పేరుతో ప్రయాణికులకు...

e-Challan: మీక్కూడా ఈ-చలాన్ల పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? క్లిక్ చేస్తున్నారా.?
Representative Image

Updated on: Oct 17, 2023 | 4:34 PM

ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ట్రాఫిక్‌ చలాన్లు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించే రోజులు వచ్చేశాయ్‌. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోన్‌కు వెంటనే ఈ చలాన్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయి. మెసేజ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేసే అవకాశం కల్పించారు.

ఇదిలా ఉంటే ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఈ చలాన్లను కూడా వదలడం లేదు. నకిలీ ఈ చలాన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాపిక్‌ పోలీసుల రూపంలో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. నకిలీ ఈ చలాన్ల పేరుతో ప్రయాణికులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. సగం ఫైన్‌ చెల్లిస్తే చాలంటూ యూజర్లను అట్రాక్ట్ చేస్తూ మోసం చేస్తున్నారు.

ఈ లింక్‌ను క్లిక్‌ చేసి వెంటనే ఫైన్‌ కడితే, 50 శాతం డిస్కౌంట్‌ అంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఒక్కసారి లింక్‌ను క్లిక్‌ చేయగానే ఫోణ్‌లోని డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో ఫోన్‌లో యూజర్ ప్రమోయం లేకుండానే కొన్ని రకాల యాప్స్ డౌన్‌లోడ్‌ అవుతున్నాయి. ఎనీ డెస్క్‌ వంటి యాప్స్‌ ద్వారా ఫోన్‌లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో వెంటనే నేరగాళ్లు బ్యాంకు ఖౄతా వివరాలను తెలుసుకొని డబ్బంతా కొట్టేస్తున్నారు. అంతేకాకుండా ఫోన్‌లోని ఫొటోలు, వ్యక్తిగత వివరాలను సేకరించి బెదిరింపులకు దిగుతోన్న సంఘటనలు చూస్తున్నారు.

ఇంతకీ వాహనదారుల ఫోన్‌ నెంబర్లు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి ఎలా వెళ్తోందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకీ ఈ డేటా నేరగాళ్ల చేతుల్లోకి ఎలా వెళ్తొంది అంటే. కొన్ని సంస్థల నుంచి సేకరించిన డేటాను సైబర్‌ నేరగాళ్లు ఇలా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరికీ వాహనాలు ఉండడంతో పెద్ద ఎత్తున మెసేజ్‌లు పంపిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఒకవేళ మీక్కూడా ఇలాంటి మెసేజ్‌ వస్తే, పొరపాటున ఈ లింక్‌ క్లిక్‌ చేయడం వల్ల డబ్బు పొగొంటుంటే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఒకవేళ చలానా పేరుతో ఫోన్‌కు మెసేజ్‌ వస్తే.. ముందుగా ఈ చలాలా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేసకోవాలి. ఒకవేళ అక్కడ కూడా చలాలా ఉన్నట్లు కనిపిస్తే అక్కడే డబ్బులు చెల్లించుకోవచ్చు. కానీ పొరపాటున కూడా మెసేజ్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి పే చేసే సరిపోతుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి…