Hyderabad: విద్యార్ధి సంఘం నేతపై దాడి ఘటనలో కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌.. మరొకరికి మెమో..

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పైగా దేశంలోనెంబర్‌ వన్‌ అనే ట్యాగ్‌లైన్‌. కానీ ఒక్క దృశ్యం తెలంగాణ పోలీసింగ్‌కు మరకగా మారింది. మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే ఓ యువతిని జట్టులాగి కిందపడేసి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడం సంచలనం రేపింది. అగ్రికల్చర్‌ వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు.

Hyderabad: విద్యార్ధి సంఘం నేతపై దాడి ఘటనలో కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌.. మరొకరికి మెమో..
Police constable suspended

Updated on: Jan 30, 2024 | 11:04 AM

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పైగా దేశంలోనెంబర్‌ వన్‌ అనే ట్యాగ్‌లైన్‌. కానీ ఒక్క దృశ్యం తెలంగాణ పోలీసింగ్‌కు మరకగా మారింది. మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే ఓ యువతిని జట్టులాగి కిందపడేసి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడం సంచలనం రేపింది. అగ్రికల్చర్‌ వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. కోర్టు భవన నిర్మాణానికి కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌ 55ను రద్దు చేయాలని చేశారు. విద్యార్ధులకు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే, ఆందోళనకారులు చెదరగొట్టే క్రమంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఏబీవీపీ స్టేట్‌ సెక్రెటరీ ఝాన్సీపై జులూం చూపించారు. ఈ ఘటనపై నిరసనలు హోరెత్తాయి. పోలీసుల వైఖరిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. టీవీ9 వరుస కథనాలతో పోలీసు అధికారులు స్పందించారు. నార్సింగి ఏసిపి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విచారణ జరిపించారు. నివేదిక ఆధారంగా ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్‌లో ఒకర్ని సస్పెండ్‌ చేశారు. మరొకరికి మెమో జారీ చేశారు.

మరోవైపు ఏబీవీపీ నేత ఝాన్సీపై పోలీసుల దాడి ఘటనను సమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం.. తెలంగాణ సీఎస్‌కు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఎన్‌హెచ్‌ ఆర్సీ.

అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ వీడియో ను షేర్ చేసి చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్సీని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us