Hyderabad: ఆలస్యంగా నడుస్తున్న ఉద్యోగుల రైలు.. నరకప్రాయంగా మారుతున్న ప్రయాణం

|

May 05, 2022 | 7:54 AM

వేసవిలో పాఠశాలలకు సెలవులు, శుభకార్యాలు ఉండటంతో చాలావరకు స్వస్థలాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతుంటారు. ఫలితంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలతో సతమతమైన ప్రయాణికులు...

Hyderabad: ఆలస్యంగా నడుస్తున్న ఉద్యోగుల రైలు.. నరకప్రాయంగా మారుతున్న ప్రయాణం
Memu Train
Follow us on

వేసవిలో పాఠశాలలకు సెలవులు, శుభకార్యాలు ఉండటంతో చాలావరకు స్వస్థలాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతుంటారు. ఫలితంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలతో సతమతమైన ప్రయాణికులు ఇప్పుడు మరో సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో గమ్యస్థానాలకు చేర్చాల్సిన రైళ్లు.. ఆలస్యంగా నడుస్తుండటంతో సతమతమవుతున్నారు. ఇదే దోవలో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు చేరింది. ఎక్కువ మంది ఉద్యోగులు ప్రయాణించే ఈ రైలుకు ఉద్యోగస్తుల రైలు అన్న పేరు పడింది. హైదరాబాద్(Hyderabad) లో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఉద్యోగం చేసుకునే వారికి ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఈ రైలు ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరేటప్పుడు సకాలంలో వెళ్లి తిరిగి వచ్చేప్పుడు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు 4 గంటల్లో చేరుకోవాల్సిన ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్.. గంట ఆలస్యంగా వస్తోంది. లింగంపల్లి(Lingampalli) చేరుకునేసరికి అర్ధరాత్రి అవుతోంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, గుంటూరు, విజయవాడలలోని ప్రధాన కార్యాలయాల్లో పని చేసుకునేందుకు వీలుగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ వేశారు. వెళ్లేటప్పుడు సమయానికి తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో ఆలస్యం అవుతోంది.

హైదరాబాద్ నగరం నుంచి వెళ్లేప్పుడు ఉద్యోగులు గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ, గుంటూరు నుంచి నగరానికి వచ్చినప్పుడే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోవాల్సిన రైలు.. ఒక్కోసారి రాత్రి 11 గంటలకు చేరుతోంది. ఇక బేగంపేటకు 11.15, లింగంపల్లికి 11.40కి వస్తోంది. ఆ సమయంలో ఇళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. క్యాబ్‌, ఆటోల్లో రూ. 300 నుంచి 500 దాకా అదనంగా చెల్లించాల్సి వస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Cricket News: 55 బంతుల్లో 107 పరుగులు.. సెంచరీతో వీర విహారం చేసిన శ్రీలంక ప్లేయర్..!

Liger Movie: వేటమొదలు పెట్టనున్న లైగర్.. క్రేజీ అప్డేట్ ఇవ్వనున్న పూరీ అండ్ విజయ్.. ఎప్పుడంటే