Hyderabad: మరోసారి పెద్దమ్మ గుడి దగ్గర శేజల్ ఆత్మహత్యాయత్నం

బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అతడి అనుచరులపై గత కొద్దిరోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారామె. అతను లైంగిక వేధించాడంటూ ఇప్పటికే రెండుసార్లు శేజల్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. దుర్గం చిన్నయ్య, అతడి అనుచరుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించానని గతంలో టీవీ9తో చెప్పారు శేజల్.

Hyderabad: మరోసారి పెద్దమ్మ గుడి దగ్గర శేజల్ ఆత్మహత్యాయత్నం
Shejal

Updated on: Jun 29, 2023 | 8:40 PM

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేసిన శేజల్‌..జూబ్లిహిల్స్‌ పెద్దమ్మ గుడి దగ్గర స్పృహ తప్పి పడిపోయింది.. మధ్యాహ్నం ఒకటిన్నరకు శేజల్‌ను ఆదినారాయనరావు అనే వ్యక్తి..పెద్దమ్మ గుడి దగ్గర డ్రాప్‌ చేశారు. తాజాగా ఆమెను అపస్మారక స్థితిలో గుర్తించారు స్థానికలుు.  శేజల్‌ బ్యాగ్‌లో నిద్రమాత్రలు దొరికాయి. పోలీసులు ఆమెను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.. గతంలో రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసిన శీజల్‌ను ఆదినారాయణ రావు ఒంటరిగా ఎందుకు వదిలి వెళ్లారు. అసలు ఆదినారాయణ రావు ఎవరు.. బ్యాగులో నిద్రమాత్రలతో పాటు ఆమె రాసిన లెటర్‌ ఉంది.. ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదు.. పెద్దమ్మ తల్లే తనకు న్యాయం చేస్తుందని లెటర్‌లో రాసి ఉంది.. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో కూడా శీజల్ సూసైడ్ అటెమ్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆరిజన్ అనే డైయిరీ ఏర్పాటులో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యను కలిశారు ఆ కంపెనీ ప్రతినిధులు. అయితే సాయం చేస్తానని చెప్పి చిన్నయ్య లైంగికంగా వేధించారన్నది శేజల్ ఆరోపణ. అమ్మాయిలను పంపాలని కూడా అడిగారని చెప్పారు. సాయం చెయ్యకపోగా బెదిరిస్తున్నారని న్యాయం కోసం రోడ్డెక్కారు శేజల్. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది శేజల్. స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు కూడా చేసింది. ఢిల్లీ BRS కార్యాలయం ముందు కూడా నిరసన తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ థాక్రేకు కూడా తన బాధను చెప్పుకుంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకు కూడా కంప్లైంట్ చేసింది.

కానీ.. శేజల్‌ ఆత్మహత్యాయత్నంపై అప్పట్లో ఘాటుగానే స్పందించారు ఎమ్మెల్యే చిన్నయ్య. తాను తప్పు చేసుంటే ఏ శిక్షకైనా సిద్ధమని మరోసారి పునరుద్ఘాటించారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే బీఆర్ఎస్‌ అధిష్ఠానం చర్యలు తీసుకునేది కదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే. తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని.. త్వరలోనే ఆరిజన్‌ డెయిరీ మోసాలు బయట పెడతానని చెప్పారు చిన్నయ్య. అలాగే శేజల్‌ వెనుక ఉన్న వ్యక్తుల గుట్టు బయట పెడతానని.. శేజల్‌ ఆత్మహత్యాయత్నం చేస్తే అబద్దాలు నిజం కావన్నారు ఎమ్మెల్యే చిన్నయ్య.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..