Road accident on ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా కల్వర్టును కొట్టిన లోడులారీ

Road accident on ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది...

Road accident on ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా కల్వర్టును కొట్టిన లోడులారీ
Orr Accident

Updated on: Apr 18, 2021 | 7:22 AM

Road accident on ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లోడు లారీ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న వ్యక్తి కింద ఉన్న కల్వర్టులో పడి మృతి చెందాగా, లారీలో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మూడు రోజుల క్రితం(గురువారం) హైదరాబాద్‌ పరిధిలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. చేపల లోడుతో వెళుతున్న కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ సజీవ దహనమయ్యారు. హిమయత్ సాగర్ అప్ప సంక్షన్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరిజిల్లా నర్సాపూర్ నుంచి ముంబై రొయ్యల లోడుతో వెళుతున్న కంటైనర్‌లో అప్ప జంక్షన్ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దానిలో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ కూడా అగ్నికి ఆహుతయ్యారు. మృతులను సూరజ్, మృతుంజయ్ గా పోలీసులు గుర్తించారు. అయితే కంటైనర్‌ను మరో వాహనం ఢీకొనడంతోనే మంటలు వ్యాపించినట్లు పోలీసులు నిర్ధారించారు.

Read also : విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కోవిడ్ తీవ్ర రూపం, వ్యాక్సిన్ కొరత.. రెండో డోస్ కోసం జనం ఎదురుచూపులు