హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు! చూశారంటే

హైదరాబాద్‌లో అపరిశుభ్రమైన, కుళ్ళిన మేక, గొర్రెల అవశేషాలను సేకరించి, ఫ్రెష్ మాంసం అని చూపిస్తూ నగరంలో విక్రయిస్తున్న నకిలీ మాంసం రాకెట్‌ గుట్టురట్టైంది. గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్, మంగళ్‌హాట్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడి ద్వారా ఛేదించారు. ఈ ఘటనలో మహమ్మద్ ఆఫ్రూస్ అనే వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు! చూశారంటే
Hyderabad Fake Meat

Edited By:

Updated on: Mar 11, 2026 | 8:53 PM

గోల్కొండ జోన్ అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ వివరాల ప్రకారం, ఈ దాడి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిస్టీ చెమాన్ ప్రాంతంలోని ఏ టు జెడ్ మటన్ షాప్ పై జరిగింది. ఈ దాడిలో సుమారు 300 కిలోల కుళ్ళిన మేక, గొర్రెల అవశేషాలు లివర్, బోటి, కాళ్లు, తలకాయ వంటి నాసిరకం భాగాలను దుకాణంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మాంసం విలువ సుమారు రూ. 25,000 అని అధికారులు వెల్లడించారు.

పోలీసుల ప్రకారం, నిందితుడు మిగిలిన మేక, గొర్రెల భాగాలను సేకరించి వాటిని డీప్ ఫ్రీజర్‌లో నిల్వ చేసి, ఫ్రెష్‌గా ఉన్నట్టు చూపిస్తూ ఎక్కువ ధరకు నగరంలో విక్రయించేవాడు. అలాగే, ఈ మాంసం కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ వంటి ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు.

గతంలో కూడా నకిలీ మాంసం విక్రయించినందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిందితుడిపై జరిమానా విధించారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదని అధికారులు తెలిపారు. కొంతమంది ఫంక్షన్ నిర్వాహకులు తక్కువ ధరకు ఈ మాంసాన్ని కొనుగోలు చేస్తున్నట్టు కూడా సమాచారం అందింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరించారు. నకిలీ, అపరిశుభ్రమైన మాంసం వాడకం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హానీ కలగవచ్చని అధికారులు తెలిపారు. అందువల్ల, ఫ్రెష్ మాంసం కొనుగోలు చేసే ముందు అధికారిక షాపులు, సర్టిఫికెట్ ఉన్న మాంసం మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా మారింది. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి నకిలీ మాంసం విక్రయాలను నివారించగలరని అధికారులు విశ్వసిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us