Dharani: నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి.. ధరణి పోర్టల్‎ సమస్యలపై NHRC ఆదేశం..

|

Oct 21, 2021 | 2:54 PM

తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించడానికి ధరణి పోర్టల్‎ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత  జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు...

Dharani: నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి.. ధరణి పోర్టల్‎ సమస్యలపై NHRC ఆదేశం..
Dharani
Follow us on

తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించడానికి ధరణి పోర్టల్‎ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత  జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ధరణి పోర్టల్‌పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లో అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించింది. ధరణిలోని సమస్యలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బుందులు పడుతున్నారని, కొందరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు.

ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో పెద్ద సంఖ్యలో భూములు ఉన్నాయని, తద్వారా చట్టబద్ధమైన రైతులు తమ భూములను కొనుగోలుదారులకు విక్రయించే హక్కును నిరాకరించారని. “ఇది భారీ స్కామ్ కాబట్టి నేను ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసినట్లు బక్క జడ్సన్ తెలిపారు. ధరణి వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ధరణిలో సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న చర్యలు, పోర్టల్‌ అమలుపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎస్‎ను ఆదేశించింది.

 

Read Also.. నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌ సర్కార్‌.. 5323 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ..