Hyderabad Cop: అతను ఉన్నత చదువులు చదివాడు.. కొంతకాలం ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గానూ పని చేసి విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాడు. చివరికి అతని బుద్ధే తప్పుదొవ పట్టడంతో ఊచలు లెక్కిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రాలు, మాయల పేరుతో మోసం చేస్తున్న నకిలీ బాబాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి భారీ స్థాయిలో నగలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కేసులో అతన్ని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. యాదాద్రి జిల్లా జమీల్‌పేటకు చెందిన 35 ఏళ్ల ఎరుకల నాగరాజు.. డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తరువాత కొంతకాలం ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు పాఠ్యాంశాలు కూడా బోధించాడు. దీంతో లాభం లేదనకుని.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొత్త అవతారమెత్తాడు.
బాబా అవతారమెత్తిన నాగరాజు.. మంత్రాలు, మాయల పేరుతో ప్రజల నుంచి అందినకాడికి దోచుకోవడం ప్రారంభించాడు. సంతానలేమి, ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలను తన మంత్రాలతో దరిచేరనివ్వనని ప్రజలను నమ్మించేవాడు. అలా తనను నమ్మి వచ్చిన ప్రజలకు పూజల పేరుతో వారి ఇళ్లకు వెళ్లేవాడు. పూజలో బంగారు ఆభరణాలు, నగదు పెట్టాలని చెప్పి.. వారు పూజలో ఉండగానే.. వాటితో ఉడాయించేవాడు. ఈ దొంగ బాబా చేతిలో మోసపోయిన పలువురు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నాగరాజుపై డేగ కన్నుతో నిఘా పెంచారు. ఈ క్రమంలో తాజాగా దొంగబాబా నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 570 గ్రాముల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లైవ్ కింది వీడియోలో చూడొచ్చు..
Also read: