My Homes Group: హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఆవివర్భవించి నేటితో (ఏప్రిల్ 8) 35 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుధీర్ఘ ప్రస్థానంలో సంస్థ సాధించిన ప్రగతి, నిర్మాణ రంగంలో ఎదిగిన తీరును వివరిస్తూ.. భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలను తెలుపుతూ మైహోమ్ డైరెక్టర్లు హైదారాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ జూపల్లి శ్యామ్ రావు, మై హోమ్ గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రామురావుతో పాటు పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ సాధించిన పలు విజయాలను మీడియాతో పంచుకున్నారు.
ఇక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మైహోమ్ సంస్థ ఇళ్ల నిర్మాణాలను చేపడుతోంది. 35 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 35 మిలియన్ చదరపు అడుగుల విక్రయాన్ని సంస్థ టార్గెట్‌గా పెట్టుకుంది. మైహోమ్ సంస్థ ఇప్పటి వరకు 2 కోట్ల 70 చదరపు అడుగులు విక్రయించంగా, 10 వేలకు పైగా వినియోగదారులను సంపాదించుకుంది.
Telangana High Court: కరోనా వ్యాప్తి అడ్డుకట్టకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు