సైబర్ క్రైమ్ పోలీసులకు ఎంఎస్కే ప్రసాద్ ఫిర్యాదు

సైబర్ క్రిమినల్స్‌కు చిన్న, పెద్ద తేడా ఉండదు. ముఖ్యంగా ప్రముఖులను వారు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ ఓపెన్ అయింది. అందులో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కొన్ని పోస్టులను పెట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఎమ్మెస్కే.. బీసీసీఐ ఉన్నతాధికారులకు తెలిపారు. వారి సూచన మేరకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో […]

సైబర్ క్రైమ్ పోలీసులకు ఎంఎస్కే ప్రసాద్ ఫిర్యాదు

Edited By:

Updated on: Apr 20, 2019 | 11:41 AM

సైబర్ క్రిమినల్స్‌కు చిన్న, పెద్ద తేడా ఉండదు. ముఖ్యంగా ప్రముఖులను వారు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ ఓపెన్ అయింది. అందులో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కొన్ని పోస్టులను పెట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఎమ్మెస్కే.. బీసీసీఐ ఉన్నతాధికారులకు తెలిపారు. వారి సూచన మేరకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్‌ను తెరిచిన గుర్తు తెలియని వ్యక్తులు.. అందులో తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా పోస్టులు పెట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులను ఆయన కోరారు.