AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon: చల్ల చల్లని కూల్ న్యూస్ వచ్చేసింది మావ.. వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

Monsoon: చల్ల చల్లని కూల్ న్యూస్ వచ్చేసింది మావ.. వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: Jun 04, 2026 | 3:18 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయని.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయని పేర్కొంది. రుతుపవనాల రాకతో కేరళలో వాతావరణం చల్లబడింది.. అంతేకాకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు, 4 జూన్ 2026 నాటికి నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు పూర్తిగా, కేరళ – మాహే, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, కొమొరిన్ ప్రాంతంలోని మిగిలిన భాగాలు, ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు విస్తరించాయి. రాగల 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా అంతటా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరఠ్వాడా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం (cyclonic circulation) నుండి కొంకణ్ గోవా మీదుగా నైరుతి అరేబియా సముద్రం వరకు ఒక ద్రోణి (trough) కొనసాగుతోంది.

ఈరోజు ఉదయం 05:30 గంటల సమయంలో దక్షిణ తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ – యానాం పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. నిన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ గుండా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడింది (less marked).

వీటి ప్రభావంతో.. తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)

గురువారం, శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజులలో క్రమంగా రెండు నుండి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings): శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 50 నుండి 60 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us