Supreme Court: కాక రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. సుప్రీంకోర్టుకు చేరిన కేసు..

తెలంగాణలో పెను సంచలనం కలిగించిన ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఫామ్ హౌస్ కేసు నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుల పిటిషన్ పై దేశ అత్యున్నత..

Supreme Court: కాక రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. సుప్రీంకోర్టుకు చేరిన కేసు..
Supreme Court
Follow us

|

Updated on: Nov 04, 2022 | 4:21 PM

తెలంగాణలో పెను సంచలనం కలిగించిన ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఫామ్ హౌస్ కేసు నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుల పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. హైకోర్టు భిన్నమైన తీర్పు ఎలా ఇస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మెరిట్‌ ఆధారంగా విచారణ జరపాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. అయితే.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రామచంద్ర భారతి, నంద కుమార్‌, సింహయాజీలు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఇటీవల టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం కలిగించింది. మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను రామచంద్రభారతి, నంద కుమార్‌, సింహయాజులు ప్రలోభ పెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేశారు. అయితే నిందితుల రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.విచారణ జరిపిన హైకోర్టు నిందితుల అరెస్ట్‌కు అనుమతించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే.. నిందితులను అరెస్టు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో షేక్‌పేటలోని ఆదిత్యా హిల్‌టాప్‌ అపార్ట్‌మెంట్‌లోని నందకుమార్‌ ఇంట్లో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత మెయినాబాద్‌ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రిమాండ్‌ రిపోర్ట్‌ తయారు చేసి, వాయిస్ రికార్డ్ చేశారు. వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం భద్రత నడుమ నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే అప్పటికే కోర్టు సమయం ముగియడంతో సరూర్‌నగర్‌లోని జడ్జి ఇంట్లో హాజరు పరిచారు. నిందితుల ఆరోగ్యం దృష్ట్యా రిమాండ్‌కు అనుమతించొద్దని వారి తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు.

కేసు తదుపరి దర్యాప్తును మునుగోడు ఉప ఎన్నిక తర్వాతే చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నవంబర్‌ 4 తర్వాత కస్టడీ పిటిషన్‌ను సిద్ధం చేస్తామని, కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం